ఇన్వెస్టర్లకు పండగే.. ఈవారం 5 ఐపీఓలు, రూ.6500 కోట్లు.. మార్చి 9 నుంచే షురూ

Wait 5 sec.

: దేశీయ ప్రైమరీ మార్కెట్లో మరోసారి ఐపీఓల సందడి నెలకొంది. ఈ వారం ఏకంగా 5 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్నాయి. లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్న ఇన్వెస్టర్లకు ఇది పండగ లాంటి వార్తే అని చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్ల నుంచి ఈ కంపెనీలు రూ. 6,578 కోట్లకు పైగా నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇటీవల ఇచ్చిన చాలా కంపెనీల పబ్లిక్ ఇష్యూలు లిస్టింగ్‌లో నష్టాలు ఇచ్చాయి. చివరి 8 ఐపీఓలలో 7 ఐపీఓలు నష్టాలు మిగిల్చాయి. ప్రస్తుతం మార్కెట్ బలహీనంగా ఉండమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) తక్కువగా ఉంది. అయితే, అయితే వాటి జీఎంపీ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. రాజ్‌పుతన స్టెయిన్‌లెస్ (Rajputana Stainless)ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ మార్చి 9, 2026 సోమవారం రోజున సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతుంది. మార్చి 11వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. మార్కెట్ నుంచి రూ. 255 కోట్లు సమీకరించనుంది. తాజా షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ ద్వారానూ షేర్ల విక్రయాలు చేపడుతోంది. ఈ ప్రైస్ బ్యాండ్ రూ. 116-రూ. 122 గా నిర్ణయించారు. ఈ కంపెనీ స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రొడక్ట్స్, బిలెట్స్, బార్స్ వంటివి తయారు చేస్తోంది. గుజరాత్‌ నుంచి వ్యాపారం నిర్వహిస్తోంది. ఇన్నోవిషన్ (Innovision)ఈ కంపెనీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ కోసం మార్చి 10వ తేదీ మంగళవారం రోజున ఓపెన్ అవుతుంది. మార్చి 12 వ తేదీ గురువారం వరకు ఉంటుంది. మార్కెట్ నుంచి రూ. 323 కోట్లు సమీకరించనుంది. రూ. 255 కోట్లు విలువైన ఫ్రెష్ షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ సైతం ఉంది. ఇక షేరు ధర రూ. 521-548 గా నిర్ణయించారు. 2007 నుంచి ఈ కంపెనీ సెక్యూరిటీ, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, మ్యాన్ పవర్ సోర్సింగ్ వంటి సేవలు అందిస్తోంది. లాజిస్టిక్స్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ రంగాల నుంచి 180కిపైగా క్లయింట్లు ఈ కంపెనీకి ఉన్నారు. రాజ్‌మార్గ్ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (Raajmarg Infra Investment Trust) - InvIT IPOప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్ఏఐ అనుబంధ సంస్థ అయిన ఈ మార్చి 13వ తేదీ వరకు కొనసాగనుంది. మార్కెట్ నుంచి రూ. 6,000 కోట్లు సమీకరించనుంది. ఈవారం వస్తోన్న ఐపీఓల్లో ఇదే అతిపెద్ద ఐపీఓగా నిలుస్తోంది. షేరు ధరల శ్రేణి రూ. 99-100 గా నిర్ణియంచారు. ఈ కంపెనీ 5 టోల్ రోడ్ అసెట్లు కలిగి ఉంది. మొత్తం 260 కిలోమీటర్ల రోడ్లు నిర్వహిస్తోంది. మార్చి 24వ తేదీన లిస్టింగ్ జరుగుతుంది.స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ (Skyways Air Services)ఈ కంపెనీ ఐపీఓ మార్చి 18వ తేదీ బుధవారం రోజున ఓపెన్ అవుతుంది. మార్చి 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సంస్థ 4.22 కోట్ల షేర్ల అందుబాటులోకి తెస్తోంది. అయితే ప్రైస్ బ్యాండ్ ప్రకటించలేదు. ఈ సంస్థ ఎయిర్ ఫ్రైట్, ఓషన్ ఫ్రైట్, ట్రకింగ్, వేర్‌ హౌసింగ్, కస్టమ్స్ క్లియరెన్స్ వంటి సేవలు అందిస్తోంది. ఎయిర్ ఇండియా కార్గో, టర్కిష్ ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా మొదలైన సంస్థలు ఈ కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి. ఆప్సిస్ ఏరోకామ్ (Apsis Aerocom)ఎస్ఎంఈ విభాగం నుంచి వస్తున్న ఐపీఓ ఇది. మార్చి 11వ తేదీనే సబ్‌స్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. మార్చి 13వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రైమరీ మార్కెట్ నుంచి రూ. 35-36 కోట్లు సమీకరించనుంది. ప్రైస్ బ్యాండ్ రూ. 104-110 గా నిర్ణయించారు. ఈ కంపెనీ ఏరోస్పేస్, డిఫెన్స్, హెల్త్‌కేర్ సెక్టార్లకు ప్రెసిషన్ ఇంజినీరింగ్ కాంపోనెంట్స్ తయారు చేస్తుంది.