ఆట డ్యాన్స్ షో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న వచ్చింది. "పలికే గోరింక చూడవె నా వంక" పాటకి ఒక కంటెస్టెంట్ క్లాసికల్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఎక్స్‌ప్రెషన్స్, టైమింగ్ అన్నీ టూ గుడ్.. అంటూ రఘు మాస్టర్ మెచ్చుకున్నారు. ఎన్ని రోజులైంది ఇది నేర్చుకోవడానికని నిహారిక అడిగితే 4 రోజులని చెప్పారు. ఇది వినగానే నిహారిక అవాక్కైంది.సార్ నేను ఏడాదిన్నరగా కథక్ నేర్చుకుంటున్నాను.. నాలుగు రోజుల్లో ఇంత చేసిందా.. అని నిహరిక అన్నారు. ఇంతలో ఈ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన మాస్టర్ గురించి విష్ణుని ఒక కొశ్చన్ అడిగాడు సుధీర్. విష్ణు మనోడికి ఒక టాలెంట్ ఉంది ఏంటో చెప్పు.. అని సుధీర్ అడిగితే విష్ణు తెల్లమొహం వేసింది. టీమ్ కొరియోగ్రాఫర్‌కి ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో చెప్పమంటే అయి చెప్పవ్.. అంటూ సుధీర్ ఆటపట్టించాడు.విష్ణుప్రియ గురించి నిహారికనాకు బ్రెయిన్ లేదు.. అయినా నన్ను పోషిస్తున్నారు ప్రొడ్యూసర్ గారు.. అంటూ నిహారిక గురించి విష్ణు చెప్పింది. అలా ఏం లేదు విష్ణు.. నువ్వు కత్తిలా ఉంటావ్ అందుకే పెట్టుకున్నాను.. అంటూ నిహారిక చెప్పేసరికి విష్ణు సిగ్గుపడిపోయింది. ఇక కొరియోగ్రాఫర్.. వెన్నెల రాత్రికి పాటకి బెల్లీ డ్యాన్స్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఈ డ్యాన్స్‌ని ఛాలెంజ్ చేస్తూ విష్ణుప్రియ గారు వేస్తారా.. అంటూ సుధీర్ ఇరికించాడు.అయినా సరే విష్ణు ఈ పాటకి అద్భుతంగా బెల్లీ డ్యాన్స్ చేసి ఫిదా చేసింది. ఈ పెర్ఫామెన్స్‌ని ఛాలెంజ్ చేస్తూ కావ్య కూడా చేస్తదా.. అని సుధీర్ మళ్లీ ఇరికించాడు. దీంతో కావ్యశ్రీ కూడా వచ్చి స్టేజ్ మీద డ్యాన్స్ చేసింది. విష్ణు-కావ్య ఇలా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంటే ఓమై గాడ్ అంటూ నిహారిక తెగ ఎంజాయ్ చేశారు. ఇక ఈ ప్రోమో చివరిలో అబ్బా అంతా ఇక్కడే చూసేద్దామనే బ్యాలెన్స్ తెలుగు జీ5లో చూడు.. అంటూ ఎడిటర్ సరదాగా టెంప్లెట్ వేశారు. మొత్తానికి విష్ణు మరోసరి తన పెర్ఫామెన్స్‌తో అందరినీ ఫిదే చేసేసింది.ఈ వీడియో కింద కామెంట్లు మొత్తం విష్ణు గురించే ఉన్నాయ్. అసలు విష్ణు సూపర్ డ్యాన్సర్.. చాలా అండర్‌రేటెడ్ బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓవైపు డ్యాన్సులతో పాటు మరోవైపు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కవర్ చేస్తూ ఆట షోని నడిపిస్తున్నారు. ఇక ఈ వారం నాగబాబు, హరీష్ శంకర్ గెస్టులుగా వచ్చారు.