మ్యూచువల్ ఫండ్స్‌లో మరో 3 కొత్త స్కీమ్స్.. మార్చి 9 నుంచే షురూ.. కనీస పెట్టుబడి ఎంతంటే?

Wait 5 sec.

Mutual fund NFOs: మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్ చేయలేని వారు ఎంచుకుంటున్నారు. వీటిల్లో పెట్టుబడి పెట్టడం చాలా సులభం, అలాగే హైరిటర్న్స్ వస్తుంటాయి. అందుకే ఎక్కువ మంది వీటిని ఎంచుకుంటున్నారు. ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి అదిరే శుభవార్త. ఎందుకంటే ఈ వారం మరో 3 కొత్త ఫండ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. సోమావారం ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు తమ పోర్ట్‌ఫోలియోల్లో ఉన్న ఖాళీలను పూరించి, కస్టమర్లను ఆకర్షించేందుకు న్యూ ఫండ్ ఆఫర్‌తో వస్తున్నాయి. మరి ఏ కంపెనీ ఏ స్కీమ్ తీసుకొస్తుంది అనే వివరాలు తెలుసుకుందాం. కొత్తగా లాంచ్ అవుతున్న మూడు ఫండ్స్‌లో రెండు ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్ కాగా, ఒకటి క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్. అంటే రెండు పథకాలను యాక్టివ్‌గా మేనేజ్ చేస్తుంటారు. ఒక స్కీమ్ మాత్రం పాసివ్‌గా మేనేజ్ చేస్తారు. కొత్తగా లాంచ్ అవుతున్న స్కీమ్స్‌లో హేలియోస్ ఆర్బిట్రేజ్ ఫండ్ () ఒకటి. ఇది ఒక ఆర్భిట్రేజ్ ఫండ్, ఈ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ మార్చి 9వ తేదీన మొదలవుతుండగా మార్చి 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఫండ్‌లో సమయంలో కనీస పెట్టుబడి రూ.5 వేలుగా నిర్ణయించారు. ఇది యాక్టివ్‌ల్లీ మేనేజ్డ్ ఓపెన్ ఎండెడ్ ఫండ్. మార్చి 9వ తేదీనే మొదలవుతోంది. అలాగే ఈనెల 16వ తేదీ వరకు ఈ సబ్‌స్క్రిప్షన్ కొనసాగుతుంది. ఈ స్కీమ్ ఎన్ఎఫ్ఓ సమయంలో కనీస పెట్టుబడి సైతం రూ.5000 గా నిర్ణయించారు. ఇది పాసివ్ ఓపెన్ ఎండెడ్ స్కీమ్. అలాగే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నుంచి యాక్సిస్ ఎఫ్ఎంపీ 130 92డీ ఫండ్ (Axis FMP- 130-92D) స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ మార్చి 11వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులోనూ కనీస పెట్టుబడి రూ.5 వేలుగా నిర్ణయించారు. ఇది యాక్టివ్లీ మేనేజ్డ్ క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్. అయితే, మ్యూచువల్ ఫండ్స్‌లోనూ హైరిస్క్ ఉంటుంది. ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యం, పెట్టుబడి ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా స్కీమ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా మ్యూచువల్ ఫండ్ లోకి ఎంట్రీ అవుతున్న వారు న్యూ ఫండ్ ఆఫర్ కి దూరంగా ఉండడమే మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.