IPL 2026లో తొలి డబుల్ హెడర్.. ఫ్యాన్స్‌కి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

Wait 5 sec.

ఐపీఎల్ ఫ్యాన్స్‌కి ఇవాళ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ దొరకనుంది. ఐపీఎల్ ప్రారంభమై వారం రోజులు పూర్తవగా.. ఈ రోజు మొదటి డబుల్ హెడర్ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఫ్యాన్స్‌కి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఢిల్లీ - ముంబై, గుజరాత్ - రాజస్థాన్ మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ 2026లో ఏప్రిల్ 4న జరిగే డబుల్ హెడర్‌ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఒక మ్యాచ్‌లో గెలిచిన ఢిల్లీ.. హోం గ్రౌండ్ వేదికగా జరిగే రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక మొదటి మ్యాచ్ శాపం నుంచి విముక్తి పొందిన ముంబై ఇండియన్స్.. ఈ సీజన్‌లో తిరుగులేని జట్టుగా ఎదగాలని చూస్తోంది. తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌ను చిత్తు చేసిన ఎంఐ, ఢిల్లీని వాళ్ల గడ్డ మీదే మట్టి కరిపించాలని గట్టిగా ఫిక్స్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అంచనాకేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్ (కెప్టెన్), విప్‌రాజ్ నిగమ్, లుంగీ ఎంగిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముకేశ్ కుమార్. ముంబై ఇండియన్స్ జట్టు అంచనార్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రూధర్‌ఫోర్డ్, మిచెల్ శాంట్నర్/ఘజన్‌ఫర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.ఇక రాత్రి 7:30 గంటలకు జరిగే రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ - రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తొలి విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆధిపత్య విజయం సాధించిన రాజస్థాన్.. ఈ మ్యాచ్‌లోనూ విక్టరీ సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలవాలని చూస్తోంది. గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనాశుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా/జేసన్ హోల్డర్, అశోక్ శర్మర, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.రాజస్థాన్ రాయల్స్ జట్టు అంచనావైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధృవ్ జురేల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయర్, డోనావన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, బర్గర్, బ్రిజేశ్ శర్మ.