సర్పంచ్ సాబ్ మాస్ మేనియా.. మ్యాచ్ విన్నర్, సైలెంట్‌ హిట్టర్!

Wait 5 sec.

కెప్టెన్ మాస్ మేనియా ఏంటో చూయించాడు. చెపాక్ స్టేడియంలో హై స్కోరింగ్ టార్గెట్ మ్యాచ్‌లో చాలా కూల్‌గా ఉంటూనే వైలెంట్ షాట్స్‌తో మ్యాచ్‌ని కంప్లీట్ చేసేశాడు. ఎప్పుడు క్రీజులోకి వచ్చాడో, ఎప్పుడు హాఫ్ సెంచరీ చేశాడు, ఎప్పుడు అవుటయ్యాడో అన్నది తెలియకుండా సైలెంట్‌గా చేసేశాడు. పంజాబ్ కింగ్స్‌ను గత సీజన్‌లో ఫైనల్ వరకూ తీసుకెళ్లిన అయ్యర్.. ఈ ఏడాది కూడా ఫైనల్ బరిలో నిలపాలనే ఫిక్స్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ అదిరిపోయే హాఫ్ సెంచరీ చేశాడు. 9వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చి శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ని నిదానంగానే ఆరంభించినట్టు కనిపించినా.. వికెట్ పడే సమయానికి సూపర్ క్లాస్ షాట్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అవుటైన తర్వాత రన్‌రేట్ ఏ మాత్రం పడిపోకుండా.. ప్రతీ ఓవర్‌లో పది పరుగులకు పైగా వచ్చేలా చూసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన శ్రేయాస్ అయ్యర్, 29వ బంతికి అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మొత్తం నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో కనిపించని హిట్టింగ్ ఆడేశాడు. 95 పరుగుల వద్ద క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్.. ఆల్‌మోస్ట్ మ్యాచ్‌ని ముగించి 186 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. ఒకవైపు వికెట్లు కాపాడుకుంటూనే, మరో వైపు బౌండరీలు బాదుతూ అసలైన కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఏంటో చూయించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 బంతుల్లో కేవలం 18 పరుగులే చేసిన అయ్యర్.. అదే మ్యాచ్‌లో గాయపడ్డాడు. దాంతో ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతాడని అనుకున్నా.. పంజాబ్ కింగ్స్ కోసం రెస్ట్ తీసుకోకుండా డెడికేషన్‌తో కీలకమైన సీఎస్కే మ్యాచ్‌కి అందుబాటులోకి వచ్చాడు. భారీ స్కోర్ రాకుండా బౌలర్లు నిలువరించలేకపోయినా.. బ్యాటింగ్‌లో యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూనే, మరోవైపు తనదైన శైలిలో ఆడి పంజాబ్‌కు విజయాన్ని అందించాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లలో ఆడింది. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఛేజింగ్ చేసి విజయం సాధించడం విశేషం. గుజరాత్ టైటాన్స్‌పై మూడు వికెట్లు తేడాతో గెలిస్తే, చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఒక మ్యాచ్ హోం గ్రౌండ్‌లో సాగగా, రెండోది బయట ఆడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండు విజయాలు సాధించి టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. పంజాబ్ తర్వాత మ్యాచ్‌ని ఏప్రిల్ 6న కోల్‌కతాతో ఆడనుంది.