అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వేళ.. తమిళనాడులో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనలు, మ్యానిఫెస్టోల విడుదల కార్యక్రమాలను పూర్తి చేసిన రాజకీయ పార్టీలు.. వాటిని జనంలోకి తీసుకెళ్లి, ఓటరు మహాశయులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి, విపక్ష అన్నాడీఎంకే కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇదే సమయంలో సినీ నటుడు తలపతి విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ కూడా తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఇప్పటికే కూడా పూర్తైంది. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలలోనూ టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇక ఉన్నారు. పెరంబూర్, తిరుచ్చి స్థానాల నుంచి విజయ్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్ షోలు, ర్యాలీలలో పాల్గొంటూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ ఎన్నికల ర్యాలీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ నటుడిగా మంచి క్రేజ్ సంపాందించుకున్న విజయ్ ఎన్నికల ర్యాలీలకు జనం భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్‌ను చూసేందుకు ఓ పెద్దాయన రోడ్డు పక్కన నిల్చున్నారు. కారులో విజయ్ ర్యాలీగా వస్తున్న సమయంలో.. ఆ వృద్ధుడు విజయ్ వద్దకు వచ్చేందుకు ప్రయత్నించగా.. కారు పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు.. ఆ వృద్ధుణ్ని తోసేయటంతో అతను కిందపడిపోయారు. ఇదంతా గమనించిన విజయ్.. సెక్యూరిటీ గార్డుపై మండిప్డడారు. అలా ప్రవర్తించవద్దంటూ తన అసహనం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ గార్డుపై విజయ్ సీరియస్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. విజయ్‌కు పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. విజయ్ ర్యాలీలలో ఇంకా భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదైమైనప్పటికీ ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరోవైపు తన ఎన్నికల ప్రచారంలో భద్రతాపరమైన లోపాలపై .. ఇటీవలే కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. నామినేషన్ వేసిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను లేఖలో ప్రస్తావించిన విజయ్.. తనకు వై కేటగిరీ భద్రత ఉందని లేఖలో గుర్తు చేశారు. ప్రచారానికి అన్ని అనుమతులు ఉన్నాయని.. అయితే భద్రతపరంగా సరైన ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు.