ఆమ్ ఆద్మీ పార్టీ తనపై చేస్తున్న ఇచ్చారునుంచి రాఘవ్ చద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ తొలగించింది. ఈ క్రమంలోనే అతనిపై కొన్ని ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలకు ధురంధర్ సినిమా డైలాగుతో కౌంటర్ ఇచ్చిన రాఘవ్ చద్దా.. ఇదంతా ముందుగా అనుకున్న ప్రకారం, పక్కా సమన్వయంతో తనపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ తనపై చేసిన ప్రతి అబద్ధాన్ని తాను బయటపెడతానన్న రాఘవ్ చద్దా, " నేను గాయపడ్డాను.. అందుకే మరింత ప్రమాదకరంగా మారాను " అంటూ ధురంధర్ సినిమా డైలాగుతో ఆప్ పార్టీకి కౌంటరిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ తనపై మూడు .. ఈ కారణాలతోనే తాను పార్లమెంటులో మాట్లాడటానికి అనుమతించలేదని చెప్పుకొచ్చారు. ఈ మూడు ఆరోపణలపైనా తన వివరణ తెలియజేశారు. ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేసిన సమయంలో తాను వారితో కలవలేదనేది పూర్తిగా అబద్ధమని రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు వాకౌట్ చేసినప్పుడు నేను వారితో పాటు కలవకుండా సీట్‌లో కూర్చుండిపోయాననే విషయాన్ని నిరూపించాలన్న రాఘవ్ చద్దా.. పార్లమెంటులో ప్రతిచోటా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని.. ఆ ఫుటేజీని బయటపెడితే నిజం తెలుస్తుందన్నారు.ఇక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అభిశంసన తీర్మానంపై తాను సంతకం చేయడానికి నిరాకరించాననే ఆరోపణలకు కూడా రాఘవ్ చద్దా కౌంటర్ ఇచ్చారు. ఇది కూడా పూర్తిగా అబద్ధమన్న రాఘవ్ చద్దా.. పార్టీలోని ఏ నేత కూడా ఈ విషయంపై తనను సంతకం చేయమని అడగలేదన్నారు. పార్టీలోని పలువురు రాజ్యసభ ఎంపీలు కూడా తీర్మానంపై సంతకం చేయలేదని.. అలాంటప్పుడు తనను మాత్రమే ఎందుకు నిందిస్తారని ప్రశ్నించారు. అలాంటి తీర్మానాలకు రాజ్యసభలో 50 మంది సభ్యుల మద్దతు, సంతకాలు సరిపోతాయని గుర్తు చేశారు. ఇక పార్లమెంట్‌లో తాను చాలా సాధారణమైన విషయాలపైనే మాట్లాడతానంటూ చేసిన విమర్శలపైనా రాఘవ్ చద్దా స్పందించారు. ఈ క్రమంలోనే కంటతడి పెట్టుకున్నారు. తాను భయంతోనే పార్లమెంట్‌లో అల్పమైన విషయాలు లేవనెత్తుతున్నాననే ఆప్ ఆరోపణలపై కౌంటర్ ఇచ్చిన రాఘవ్ చద్దా.. తాను పార్లమెంటుకు అరవడానికో, గందరగోళం సృష్టించడానికో.. మైక్రోఫోన్లు పగలగొట్టడానికో వెళ్ళటం లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను లేవనెత్తడానికే తాను పార్లమెంట్‌కు వెళ్తానన్న రాఘవ్ చద్దా.. జీఎస్టీ, ఆదాయపు పన్ను, పంజాబ్ నీటి సరఫరా, ఢిల్లీ వాయు కాలుష్యం, ప్రభుత్వ పాఠశాలల దుస్థితి, ప్రజారోగ్య వ్యవస్థ, రైళ్లల్లో ప్రయాణికుల సమస్యలను ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు తాను సమస్యలను లేవనెత్తి ప్రభావం చూపించడానికి వెళ్తానే కానీ.. గందరగోళం సృష్టించడానికి కాదని.. తన నాలుగేళ్ల పార్లమెంట్ రికార్డులను చూస్తే ఈ విషయం తెలుస్తుందని రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. నేను గాయపడ్డాను.. అందుకే మరింత ప్రమాదంగా మారానంటూ రాఘవ్ చద్దా కౌంటర్ ఇచ్చారు.