తలుచుకుంటే ఎక్కడి నుంచైనా పోటీ.. కానీ, అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోవటంపై అన్నామలై..

Wait 5 sec.

దగ్గర పడుతోంది. ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థులను ప్రకటించాయి. అన్నాడీఎంకేతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్న బీజేపీ కూడా తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అయితే రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేరు వినిపించింది. అయితే ఐదేళ్లు తిరిగేసరికి అభ్యర్థుల జాబితాలో అన్నామలై పేరు కూడా లేకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవటంతో కె. అన్నామలై స్పందించారు. కేరళలో ఎన్నికల ప్రచారం ముగించుకుని శనివారం చెన్నైకు చేరుకున్న అన్నామలై.. బీజేపీ అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోవటంతో స్పందించారు. ఈ క్రమంలోనే ఈ సారి ఎన్నికల బరిలో తాను ఉండటం లేదని అన్నామలై స్పష్టం చేశారు. బీజేపీ కేంద్ర అధిష్టానం వద్దకు పంపించిన ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాలో కూడా తన పేరు లేదని అన్నామలై స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంపై ఎక్కువగా దృష్టి పెట్టడానికే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాను తలుచుకుంటే తమిళనాడులోని ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయగలనన్న అన్నామలై.. అయితే ఈసారి తన దృష్టి అంతా బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం చేసి, వారిని గెలిపించడంపైనే ఉందని స్పష్టం చేశారు. " నేను ఎన్నికల రేసులో కానీ, జాబితాలో కానీ లేను. ఈ ఎన్నికల్లో తమిళనాడు వ్యాప్తంగా అభ్యర్థుల తరుఫున ప్రచారం చేయటమే నా బాధ్యత. ప్రస్తుతానికి ఏప్రిల్ 7వ తేదీ వరకూ పుదుచ్చేరి, కేరళలో ఎన్నికల ప్రచారం చేయమని పార్టీ నాకు బాధ్యతలు అప్పగించింది. ఏప్రిల్ 7వ తేదీ తర్వాత నుంచి ఏప్రిల్ 23 వరకూ తమిళనాడులో ప్రచారం చేస్తా. ఇది పార్టీ అధిష్టానం నాకు అప్పజెప్పిన బాధ్యత , ఈ బాధ్యతను నేను పూర్తి చేయాల్సి ఉంది" అని కన్నూరు విమానాశ్రయంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు అన్నామలై బదులిచ్చారు. ఈ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని అనుకోవటం లేదని తాను గతంలోనే బీజేపీ కోర్ కమిటీకి తెలియజేసినట్లు అన్నామలై తెలిపారు. రాష్ట్రం నుంచి కేంద్ర పెద్దల ఆమోదం కోసం పంపించిన ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాలోనూ తన పేరు లేదన్నారు. తనకు ఎన్నికల్లో టికెట్ నిరాకరించలేదని.. తానే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అన్నామలై తెలిపారు. తన నిర్ణయాన్ని తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇంఛార్జి పీయూష్ గోయెల్‌కు సైతం వారం కిందటే తెలియజేసినట్లు అన్నామలై క్లారిటీ ఇచ్చారు. తన నిర్ణయాన్ని గౌరవించినందుకు బీజేపీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు.