ఐపీఎల్‌లోనే బిగ్గెస్ట్ ఫైట్ అంటే సీఎస్కే - ఆర్సీబీ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిందంటే ఆ రోజు స్టేడియం షేక్ అవ్వాల్సిందే.. సోషల్ మీడియా రచ్చ రచ్చ అవ్వాల్సిందే. ఆఖరి బంతి వరకూ నువ్వా - నేనా అన్నట్టు జరిగే ఈ రసవత్తర పోరు చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య టప్ఫెస్ట్ ఫైట్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐదుసార్లు టైటిల్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు జరిగే ఈ మ్యాచ్ లైవ్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఆర్సీబీ ఫేవరెట్‌గా దిగే ఈ మ్యాచ్‌లో తాడో పేడో తేల్చుకోవడానికి సీఎస్కే సిద్ధమైంది. ఐపీఎల్‌లో ఈ రెండు జట్ల మధ్య 34 మ్యాచ్‌లు జరిగితే సీఎస్కే అత్యధికంగా 21 మ్యాచ్‌లలో విజయం సాధించగా, ఆర్సీబీ కేవలం 13 మ్యాచ్‌లలోనే గెలిచింది. అయితే, చివరగా జరిగిన మూడు మ్యాచ్‌లలో ఆర్సీబీ ఓటమి ఎరుగకుండా విజయం సాధించింది. గత సీజన్‌లో బెంగళూరు, చెన్నై వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ ఆర్సీబీ గెలిచి రికార్డు సృష్టించింది. ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లితో పాటు రొమారియో షెఫర్డ్ ఫేవరెట్‌గా ఉండనుండగా.. సీఎస్కే‌కి ధోనీ లేని లోటు కనిపించనుంది. అయితే, డివాల్డ్ బ్రెవిస్ జట్టులోకి రానుండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్ ఫుల్ ఫామ్‌లో ఉండగా.. ఆర్సీబీ బౌలర్లు జేకబ్ డప్ఫీ, భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలరు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆరంభ మ్యాచ్‌లో ఆడిన ఆర్సీబీ ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ 200కు పైగా పరుగులు చేసినా కేవలం 15 ఓవర్లలోనే ఊదేసి తమ బ్యాటింగ్ బలాన్ని చాటి చెప్పింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలయింది. సీఎస్కే బ్యాటింగ్ ఫర్వాలేదు అనిపించినా బౌలింగ్ తేలిపోవడంతో ఓటమి తప్పలేదు. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ నాలుగో స్థానంలో ఉండగా, చెన్నై పదో స్థానంలో ఉంది. ఆర్సీబీ జట్టు అంచనాఫిల్ సాల్ట్, , దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), రొమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జేకబ్ డప్ఫీ, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ. సీఎస్కే జట్టు అంచనారుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, కార్తీక్ శర్మ, డివాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్/అకేలా హోసెస్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మ్యాట్ హెన్రీ/జెమీ ఓవర్టన్.