శాంతించిన బంగారం ధరలు.. ఈరోజు 22,24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఇవే.. తులం ఎంత పలుకుతోందంటే?

Wait 5 sec.

Gold Rate Today: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ముగింపుపై అనిశ్చితి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో మాట మార్చుతుండడం, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు రోజు రోజుకు తీవ్రమవుతుండడం ఆందోళనలు పెంచుతోంది. గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికాకు చెందిన కంపెనీలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరికలు చేస్తుండడం ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఇరాన్ యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతున్న క్రమంలో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 116 డాలర్లు దాటింది. దీంతో గత వారంలో బంగారం ధరలు వరుసగా పెరిగాయి. రల పెరుగుదల నుంచి ఆందోళన చెందిన కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. బంగారం ధరలు శాంతించాయి. ఇవాళ ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి హైదరాబాద్ మార్కెట్లో ఏప్రిల్ 5వ తేదీన ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు రికార్డ్ గరిష్ఠాల్లో ట్రేడవుతున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 24 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ 4676 డాలర్లు పలుకుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.28 శాతం పెరిగింది. దీంతో ఔన్స్క వెండి ధర 73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. వారం రోజుల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏ మార్పు లేకుండా రూ. 1,50,930 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల 916 బంగారం ధర 10 గ్రాములకు ఈరోజు స్థిరంగా రూ. 1,38,350 వద్ద ట్రేడవుతోంది. స్థిరంగానే వెండి రేట్లుబంగారంతో పాటు వెండి రేటు సైతం ఇవాళ మారలేదు. వెండి రేటు రెండు రోజులుగా స్థిరంగానే కొనసాగుతోంది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 2,55,000 వద్ద అమ్ముడవుతోంది. అయితే, బులియన్ మార్కెట్లో ధరలు మధ్యాహ్నం లోపే మారుతుంటాయి. కొనుగోలు చేసే వారు తమ ప్రాంతంలో ఉండే ధరలను కొనే ముందే తెలుసుకోవడం మంచిది. అలాగే బంగారం ఆభరణాలపై తరుగు, వీఏ, జీఎస్టీ వంటివి ఉంటాయి. దీంతో ప్రాంతాలను బట్టి ధరలు మారిపోతుంటాయి.