పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఇచ్చారు. అమెరికాతో ఇరాన్ ఒప్పందం చేసుకోవటానికి, హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు.. తాము ఇచ్చిన గడువు పూర్తవుతోందని ట్రంప్ గుర్తు చేశారు. ఇరాన్‌కు ఇచ్చిన పది రోజుల గడువు పూర్తి కావొస్తోందని.. 48 గంటల సమయం మాత్రమే ఉందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సమయం మించిపోతోందని.. 48 గంటల తర్వాత విధ్వంసమేనని వార్నింగ్ ఇచ్చారు. ఆపైన అంతా భగవంతుడి దయ అంటూ డొనాల్డ్ ట్రంప్.. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. "ఒప్పందం కుదుర్చుకోవడానికి లేదా హర్మూజ్ జలసంధిని తెరవడానికి నేను ఇచ్చిన విషయం గుర్తుందా? సమయం మించిపోతోంది. వారిపై ప్రళయం విరుచుకుపడటానికి ఇంకా 48 గంటలే మిగిలి ఉన్నాయి. ఆపై అంతా భగవంతుడి దయ" అంటూ ట్రంప్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు అమెరికాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవటానికి ఇరాన్‌కు ఏప్రిల్ ఆరో తేదీ వరకూ ట్రంప్ గడువు ఇచ్చారు. ఈ గడువు సమీపిస్తున్న తరుణంలో.. ఇరాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అమెరికా డిమాండ్లను అంగీకరించటంతో పాటుగా హర్మూజ్ జలసంధిని తెరవటంలో టెహ్రాన్ విఫలమైతే.. 48 గంటల్లో వారిపై ప్రళయం విరుచుకుపడుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయితే ట్రంప్ ఒప్పందం ప్రతిపాదనలను ఇరాన్ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తోంది. ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాన్ని విరమించే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్.. ఇరాన్‌కు 16 అంశాలతో ప్రతిపాదన పంపించారు. అయితే ఈ అంశాలపై అమెరికాతో చర్చలకు ఇరాన్ అంగీకరించటం లేదు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌ను ఇప్పటికే పలుసార్లు హెచ్చరించారు ట్రంప్. శాంతి ఒప్పందంపై ఇరాన్ ముందుకు రాకపోతే, హర్మూజ్ జలసంధిని తెరవకపోతే.. చేస్తామని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించటం లేదు. ఇరాన్ అమెరికా ప్రతిపాదనలను అవాస్తవాలు, అతిశయాలుగా పేర్కొంటూ వాటిని తిరస్కరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఓవైపు దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తూనే.. మరోవైపు అమెరికా అదనపు బలగాలను మోహరిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ చేసిన తాజా హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.