ఒక్కరోజు మురిపెమే.. మళ్లీ ఒక్కసారిగా బంగారం ధరల్లో మార్పు.. తులం గోల్డ్ ఇప్పుడు ఎంతంటే?

Wait 5 sec.

: భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా మహిళలు బంగారు ఆభరణాల్ని ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పండగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయంలో డిమాండ్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది చెప్పొచ్చు. గతేడాది అంతర్జాతీయంగా అనిశ్చితి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం సహా రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. బంగారం కిందటేడాది 70 శాతం వరకు.. సిల్వర్ 150 శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది కూడా ఆరంభంలో భారీగానే పెరగ్గా.. మళ్లీ ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ రేట్లు దిగొచ్చాయి. ఇక్కడ క్రూడాయిల్ ధరలు పెరగడంతో.. ద్రవ్యోల్బణం భయాలు పెరిగి.. డాలర్ పుంజుకుంది. దీంతో బంగారం ధరలు దిగొచ్చాయి. తర్వాత మళ్లీ యుద్ధం ముగింపుపై సానుకూల సంకేతాలతో.. వారం- 10 రోజుల పాటు గోల్డ్, సిల్వర్ రేట్లు పుంజుకున్నాయి. ఏప్రిల్ 2న ట్రంప్ మరోసారి 2-3 వారాలు ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించగా.. క్రూడాయిల్ ఒక్కసారిగా మళ్లీ పెరగడంతో బంగారం ధర భారీగా దిగొచ్చింది. . అయితే ఇప్పుడు ఏప్రిల్ 4న మళ్లీ ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా స్వల్పంగా పెరిగాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు కాస్త పెరిగి 4,676 డాలర్ల స్థాయిలో ఉంది. అంతకుముందు ఇది 4,600 డాలర్ల స్థాయికి పడిపోయింది. సిల్వర్ రేటు కూడా 73 డాలర్ల స్థాయికి పెరిగింది. దీంతో దీనికి అనుగుణంగానే దేశీయంగా మళ్లీ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఏప్రిల్ 4న ఉదయం 7 గంటల సమయంలో 22 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే రూ. 1800 మేర పెరిగి 10 గ్రాములకు రూ. 1,38,350 వద్ద ట్రేడవుతోంది. కిందటి రోజు ఇది రూ. 3650 మేర తగ్గడం విశేషం. దానికి ముందు చూస్తే వరుసగా రూ. 3150, రూ. 1150, రూ. 150, రూ. 2300, రూ. 950 చొప్పున పెరిగింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఇప్పుడు రూ. 1960 పెరగడంతో తులం పసిడి ధర రూ. 1,50,930 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. ఇది హైదరాబాద్ మార్కెట్లో కేజీకి ఇప్పుడు రూ. 2.55 లక్షల వద్ద ఉంది. దీనికి ముందటి రోజు రూ. 10 వేలు తగ్గింది.