: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకొని ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఎన్నో అంశాలు స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంటాయి. అయితే స్వల్ప కాలంలో కంటే దీర్ఘకాలంలో మాత్రం స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తుంటాయి. ఇంకా.. అంతర్జాతీయంగా అనిశ్చితి.. ఇతర అంశాలతో కొన్ని స్టాక్స్ దారుణంగా పడిపోతుంటాయి. గత కొంత కాలంగా భారత స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. గతేడాది జనవరిలో బాధ్యతలు చేపట్టాక.. స్టాక్ మార్కెట్లు అప్పటినుంచి పడుతూనే ఉన్నాయి. దిగుమతి సుంకాల్ని పెంచగా.. స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. ఇతర దేశాలతో కవ్వింపులు.. చైనాతో వాణిజ్య యుద్ధం కూడా ప్రభావం చూపింది. దీంతో స్టాక్ మార్కెట్లలో నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల మళ్లీ ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం మరింత ఒత్తిడిని పెంచింది. దీంతో స్టాక్ మార్కెట్లు మార్చి నెలలో మరింత భారీగా పతనం అయ్యాయి. సెన్సెక్స్ మార్చి నెలలోనే 10 శాతానికిపైగా పడిపోయింది. దీంతో పలు హెవీ వెయిట్ స్టాక్స్ ఎస్బీఐ, రిలయన్స్ సహా ఐటీ స్టాక్స్ ఇలా అన్నీ భారీగా పడిపోయాయి. ఇక్కడ అన్నింటికంటే ఎక్కువగా దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ అధికంగా ప్రభావితమైంది. .. అక్కడి నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్‌పై తీవ్ర ఒత్తిడి పడింది. వరుసగా పతనం అవుతూనే వచ్చింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 1020.50 కాగా.. కనిష్ఠ ధర రూ. 726.65 గా ఉంది. ఇటీవల యుద్ధం నేపథ్యంలో స్టాక్ ధర మరింత పతనమై ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరింది. సంస్థ మార్కెట్ విలువ రూ. 5.75 లక్షల కోట్లుగా ఉంది. గత 5 రోజుల వ్యవధిలో 2 శాతం వరకు షేర్ ధర తగ్గింది. నెల వ్యవధిలో చూస్తే 14 శాతం వరకు తగ్గింది. 6 నెలల వ్యవధిలో ఈ స్టాక్ ధర 23 శాతం తగ్గింది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు చూస్తే ఏకంగా 25 శాతం తగ్గింది. దీంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు వస్తున్నాయి. ఏడాది వ్యవధిలో 18 శాతం వరకు పడిపోయింది. మార్కెట్ విలువ పరంగా ఇది ఒకప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను కూడా అధిగమిస్తుందని భావించారు. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి ఇలా తయారైంది. గమనిక: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి.. వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది.