పదే పదే అదే తప్పు.. శ్రేయాస్ అయ్యర్‌కు పనిష్‌మెంట్! పాపం పంజాబ్ టీమ్ మొత్తానికీ ఫైన్

Wait 5 sec.

చెన్నై సూపర్ కింగ్స్‌పై గ్రాండ్ విక్టరీ సాధించిన పంజాబ్ కింగ్స్‌కు పెద్ద పనిష్‌మెంటే దక్కింది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ ఒక్కడికే కాకుండా, టీమ్ మొత్తానికి బీసీసీఐ ఫైన్ విధించింది. వరుసగా రెండో సారి క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించాడనే కారణంతో ఈ సారి శిక్ష మరింత పెరిగింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం కనీస ఓవర్ రేట్ పాటించకపోతే కెప్టెన్‌‌పై చర్యలు తీసుకుంటారు. దాంతో శ్రేయాస్ అయ్యర్‌‌కు రూ. 24 లక్షల జరిమానా విధించగా, జట్టులోని మిగతా సభ్యులకు ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా 12 మందికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేయడం గమనార్హం. ఐపీఎల్ 2025లో భాగంగా ఏప్రిల్ 3వ తేదీ జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించాడు. మార్కస్ స్టాయినీస్‌కు ఒక్క ఓవరే ఇవ్వగా, చాహల్ మూడు ఓవర్లు బౌలింగ్ చేశాడు. అర్ష్‌దీప్, జేవియర్ బార్ట్‌లెట్, మార్కో యాన్సన్, విజయ్ కుమార్ వైశాక్ తలో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేశారు. ఆరుగురు బౌలర్లే బౌలింగ్ చేసినా స్లో ఓవర్ రేట్ ఎందుకు వచ్చిందంటే.. దానికి ప్రధాన కారణం ఎక్స్‌ట్రాసే. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు 17 ఎక్స్‌ట్రా పరుగులు సమర్పించుకున్నారు. అందులో 15 వైడ్‌లు, ఒక నో బాల్ ఉంది. దాదాపు 16 బంతులు అధికంగా వేశారు.. అంటే దాదాపు మూడు ఓవర్లు అదనంగా బౌలింగ్ చేసినట్టే. దాంతో స్లో ఓవర్ రేట్ నమోదైంది. ఈ కారణంతోనే శ్రేయాస్ అయ్యర్‌తో పాటు మిగతా జట్టు సభ్యులకూ నిర్వాహకులు ఫైన్ విధించారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 209 పరుగులు చేయగా పంజాబ్ 18.4 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది.