ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాటర్లు అంటే ముందుగా గుర్తొచ్చేది , ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు. ఇప్పుడు ఆ రెండు జట్ల మధ్య సమరం చూసేందుకు ఐపీఎల్ ఫ్యాన్స్ రెడీ అయ్యారు. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌‌లో పరుగుల వరద పారడం గ్యారెంటీ అని క్రికెట్ విశ్లేషకులు ఫిక్స్ అయ్యారు. ఐపీఎల్ 2026లో భాగంగా పదో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ - లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ డబుల్ హెడర్‌లో భాగంగా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఐపీఎల్‌లో ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లో లక్నోదే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకు హైదరాబాద్ - లక్నో ఆరు మ్యాచ్‌లలో తలపడ్డాయి. అందులో లక్నో అత్యధికంగా నాలుగు మ్యాచ్‌లలో గెలవగా, సన్‌రైజర్స్ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. హైదరాబాద్ వేదికగా గతేడాది జరిగిన బిగ్ ఫైట్‌లో లక్నో 190 పరుగుల టార్గెట్‌ను కేవలం 16.1 ఓవర్లలోనే ఛేదించింది. మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమైన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడో మ్యాచ్ కూడా మిస్సయ్యేలా ఉన్నాడు. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడని బ్రైడన్ కార్స్‌ను బరిలోకి దింపే అవకాశం ఉంది. డేవిడ్ పైన్ స్థానంలో కార్స్‌ను రీ ప్లేస్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనాఅభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్ / హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్స్ / డేవిడ్ పైన్, ఈషాన్ మలింగ. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అంచనామిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, ఆయుష్ బదోనీ, నికోలస్ పూరన్, అబ్దుల్ సమ్మద్, ముకుల్ చౌదరి, దిగ్వేష్ రాఠీ, మొహమ్మద్ షమీ, నోకియా, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్.