ఆంధ్రప్రదేశ్‌లో పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ కింద ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుకునే విద్యార్థులకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతీ సంవత్సరం రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ తల్లికి వందనం నిధులను అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది అర్హుల అకౌంట్లలో రూ.15 వేలు జమ చేయగా.. ఈ ఏడాది తల్లికి వందనం నిధులకు సంబంధించి.. తాజాగా నెల్లూరు జిల్లా వింజమూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు.. అధికారిక ప్రకటన చేశారు.2026-2027 అకడమిక్ ఇయర్‌కు సంబంధించిన తల్లికి వందనం నిధులను అర్హుల ఖాతాల్లో జూన్‌ నెలలోనే జమ చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది వేసవి సెలవుల తర్వాత జూన్‌ నెల ప్రారంభంలో రాష్ట్రంలో అన్ని పాఠశాలలు, కాలేజీలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అకడమిక్ ఇయర్ మొదట్లోనే చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లులు ఉన్నప్పటికీ అందరికీ.. ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున నిధులను జమచేయనున్నారు. ఇక విద్యార్థులకు తల్లిదండ్రులు లేకపోతే వారిని సంరక్షించే వారి ఖాతాల్లో తల్లికి వందనం నిధులు వేయనున్నారు. తల్లికి వందనం నిధులు ఇవ్వాలంటే ప్రతీ విద్యార్థికి కచ్చితంగా 75 శాతం అటెండెన్స్ ఉండాలని నిబంధనలు పెట్టారు. విద్యార్థి తల్లికి బ్యాంక్ అకౌంట్.. అది ఆధార్‌ కార్డుతో లింక్ అయి ఉండాలి. ఇక స్కూల్, కాలేజీలో విద్యార్థుల మెయింటెనెన్స్ ఖర్చుల కింద రూ.2 వేలను మినహాయించుకుని.. రూ.13 వేలను అర్హుల ఖాతాల్లో జమ చేస్తారు. విద్యార్థులను చదివించడం.. వారి తల్లిదండ్రులకు భారం కూకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకాన్ని మొదలుపెట్టింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో.. ఇదే పథకాన్ని అమ్మ ఒడి పేరుతో అమలు చేశారు.