ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు పండగే.. మూడు రోజులు వరుసగా సెలవులు వచ్చాయి. మూడ్రోజులు స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు మూతపడతాయి.. ఆగస్ట్ 8వ తేదీ వరలక్ష్మి వ్రతం, ఆగస్ట్ 9న రాఖీ పౌర్ణమితో పాటుగా రెండో శనివారం వచ్చింది. అలాగే ఆగస్ట్ 10వ తేదీ ఆదివారం వచ్చింది.. ఇలా మూడు రోజులు వరుసగా సెలవులు ఉన్నాయి. వరుసగా స్కూళ్లకు సెలవులు రావడంతో రైళ్లు, బస్సుల్లో రద్దీ కనిపిస్తోంది.. రాఖీ పండగ ప్రభావం కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలో దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు రిజర్వేషన్లు లిస్ట్ పెరిగింది. మరోవైపు ఆ తర్వాత వారమే వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.. ఆగస్ట్ 15వ తేదీ (శుక్రవారం) స్వాతంత్ర దినోత్సవం కాగా.. ఆ రోజు సెలవు. ఆగస్ట్ 16వ తేదీ శ్రీకృష్ణాష్టమి (శనివారం) సెలవు వచ్చింది. ఆగస్ట్ 17వ తేదీ (ఆదివారం) మరో సెలవు వచ్చింది. ఈ వారం మాత్రమే కాదు వచ్చే వారంలో కూడా శుక్ర, శని, ఆదివారాలు వరుసగా సెలవులు ఉన్నాయి. ఈ నెలలో . వీటిలో రెండు వారాలు వరుసగా మూడు రోజుల చొప్పున సెలువులు ఉండటం విశేషం. ఆగస్టు నెలలో సెలవు దినాలు ఇలా ఉన్నాయి.03-08-2025ఆదివారం08-08-2025వరలక్ష్మీ వ్రతం09-08-2025రాఖీ పండగ, రెండవ శనివారం10-08-2025ఆదివారం15-08-2025స్వాతంత్ర్య దినోత్సవం16-08-2025శ్రీకృష్ణాష్టమి17-08-2025ఆదివారం24-08-2025ఆదివారం27-08-2025వినాయక చవితి31-08-2025ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి సెలవుల జాబితాను విడుదల చేసింది. వచ్చే ఏడాది మొత్తం 44 రోజులు సెలవులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఇందులో సాధారణ సెలవులు 23, ఆప్షనల్ హాలిడేస్ 21 ఉన్నాయి. ఈ సెలవుల వివరాలు జీవోలో పేర్కొన్నారు. సాధారణ సెలవులు 23 రోజులు, ఆప్షనల్ సెలవులు 21 రోజులు ఉన్నాయి. సెప్టెంబర్ నుండి డిసెంబర్ 2025 వరకు సెలవుల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 5న ఈద్ మిలాదున్ నబీ (శుక్రవారం) సెలవు. సెప్టెంబర్ 30న దుర్గాష్టమి (మంగళవారం) వస్తుంది. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి, విజయ దశమి (గురువారం) ఒకే రోజున ఉన్నాయి. దీపావళి అక్టోబర్ 20న (సోమవారం) జరుపుకుంటారు. డిసెంబర్ 25న క్రిస్మస్ (గురువారం) సెలవు ఉంటుంది. కొన్ని ఆప్షనల్ సెలవులు ఉన్నాయి.. సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య, అక్టోబర్ 9న యాజ్ దహుమ్ షరీఫ్, నవంబర్ 11న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 24న క్రిస్మస్, డిసెంబర్ 26న బాక్సింగ్ డే సెలవులు.