లో కెప్టెన్ ఇన్నింగ్స్‌లు చాలా కీలకంగా మారాయి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్ బాధ్యతంతా తన భుజాలపై వేసుకుని విజయాల వైపు నడిపిస్తున్న తీరు అభినందనీయం. యూఎస్ఏతో మ్యాచ్‌లో టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ఇప్పటికీ మరచిపోలేము. ఆ తర్వాత . తాజాగా డూ ఆర్ డై మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ కెప్టెన్ పోరాటానికి సలాములు కొట్టారు. గ్రూప్ 2 సూపర్-8లో భాగంగా కొలంబోలోని ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో జరిగిన శ్రీలంక - న్యూజిలాండ్ మ్యాచ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక అద్భుతంగా బౌలింగ్ చేసింది. లంక స్పిన్ దెబ్బకు కివీస్ టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్‌కు క్యూ కట్టింది. ఒకరి తర్వాత ఒకరు అవుటవ్వడంతో కేవలం 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 12.1 ఓవర్‌కే 6 వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్ మహా అయితే 120 పరుగులు లేదా ఆ లోపే ఆలౌట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మొనగాడు ఇన్నింగ్స్‌తో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మెక్‌కానిచ్‌తో కలిసి తొలుత వికెట్ పడకుండా జాగ్రత్త పడిన సాంట్నర్ ఆఖర్లో బ్యాట్‌కి పని చెప్పడంతో పరుగులు వాటంతట అవే వచ్చాయి. 13, 14, 15 ఓవర్లలో కేవలం రెండ్రెండు పరుగుల చొప్పున తీసుకుంటూ వచ్చిన న్యూజిలాండ్.. 16వ ఓవర్ నుంచి గేర్ మార్చింది. 15వ ఓవర్ ముగిసే సమయానికి న్యూజిలాండ్ 90/6తో ఉండగా.. సాంట్నర్ 8 బంతుల్లో 3, మెక్‌కానిచ్ 11 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేశారు. 16వ ఓవర్ దగ్గర నుంచి ఈ ఇద్దరూ విధ్వంసం సృష్టించారు. ఆఖరి ఐదు ఓవర్లలో ఈ ఇద్దరు 78 పరుగులు నమోదు చేశారు. 16వ ఓవర్‌లో 8, 17వ ఓవర్‌లో 18, 18వ ఓవర్‌లో 21, 19వ ఓవర్‌లో 19, 20వ ఓవర్‌లో మాత్రం 12 పరుగులే వచ్చాయి. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మెక్‌కానిక్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేయగా.. మిచెల్ సాంట్నర్ 26 బంతుల్లో రెండు ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసి ఆఖరి బంతికి అవుటయ్యాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ సాంట్నర్ రాణించాడు. నాలుగు ఓవర్లలు బౌలింగ్ చేసి కేవలం 19 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో సాంట్నర్ మొత్తం ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించి శ్రీలంకను 20 ఓవర్లలో 107/8కే కట్టడి చేశాడు. దాంతో న్యూజిలాండ్ 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, సెమీస్ ఆశలు సజీవం చేసుకుంది.