IND vs ZIM: నేడు భారత్ భవిష్యత్ తేల్చే మ్యాచ్.. జింబాబ్వేపై 10 ఓవర్లలో ఛేజ్ చేయకపోతే వరల్డ్‌కప్ నుంచి ఔట్!

Wait 5 sec.

దశలో టీమిండియాకు చావో రేవో మ్యాచ్. ఇటీవల . ఆ మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో నెట్‌రన్‌రేట్ తీవ్రంగా పడిపోయింది. దీంతో ఇప్పుడు సెమీస్ బరిలో నిలవాలంటే కేవలం గెలుపు సరిపోదు.. భారీ విజయం తప్పనిసరి అనే పరిస్థితి ఏర్పడింది.నేడు జింబాబ్వేతో జరిగే మ్యాచ్ భారత్‌కు డూ ఆర్ డై పోరాటంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా సరే, నెట్‌రన్‌రేట్ మెరుగుపడకపోతే సెమీఫైనల్ అవకాశాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఈ మ్యాచ్‌లో ఎంత తేడాతో గెలుస్తుందన్నదే కీలకంగా మారింది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది.భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేభారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే పరిస్థితి కొంత సులువుగా ఉంటుంది. నెట్‌రన్‌రేట్‌ను పాజిటివ్‌లోకి తీసుకురావాలంటే కనీసం 77 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. అంటే భారత్ 170 పరుగులు చేస్తే జింబాబ్వేను 92 లోపే ఆలౌట్ చేయాలి. 180 చేస్తే 103 లోపే, 190 చేస్తే 113 లోపే, 200 చేస్తే 123 లోపే కట్టడి చేయాలి. భారీ స్కోర్‌తో పాటు కట్టుదిట్టమైన బౌలింగ్ ప్రదర్శన చూపితేనే ఇది సాధ్యమవుతుంది.టీమిండియా ఛేజింగ్ అయితే..ఒకవేళ భారత్ ఛేజింగ్ చేస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. సాధారణంగా 16 లేదా 17 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేజ్ చేస్తే నెట్‌రన్‌రేట్ కొంత మెరుగుపడుతుంది కానీ ఇప్పుడు అది సరిపోదు. పూర్తిగా పాజిటివ్‌లోకి రావాలంటే దూకుడైన ఆట తప్పనిసరి. జింబాబ్వే 140 పరుగులు చేస్తే సుమారు 10.4 ఓవర్లలో, 160 చేస్తే 11.2 ఓవర్లలో, 180 చేస్తే 11.4 ఓవర్లలో, 200 చేస్తే 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాలి. అంటే పవర్‌ప్లే నుంచే దూకుడు చూపించాలి, మధ్య ఓవర్లలో వేగం తగ్గితే ప్రమాదమే.ఈ నేపథ్యంలో టాస్ కూడా కీలక పాత్ర పోషించనుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తే భారత్‌కు లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. 77 పరుగుల తేడాతో గెలవడమే టార్గెట్‌గా పెట్టుకుని ఆడవచ్చు. ఛేజింగ్‌లో దిగితే వేగం, ఒత్తిడి రెండూ పెరుగుతాయి. అందుకే ముందుగా బ్యాటింగ్ చేయడమే భారత్‌కు మంచిదని భావిస్తున్నారు.