ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ స్పెషల్ సేల్.. రూ. 1450 కే ఫ్లైట్ టికెట్.. అక్టోబర్ 8 వరకు ఎప్పుడైనా వెళ్లొచ్చు!

Wait 5 sec.

Manage Booking: అనేది ఒకప్పుడు చాలా భారంగా ఉండేది. ఇది ధనవంతులకు మాత్రమే అన్నట్లుగా ఉండేదన్న సంగతి తెలిసిందే. టికెట్ ధరలు కూడా బస్సు, ట్రైన్‌తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే సామాన్యులకు కూడా అలా విమానం ఎక్కి ఆకాశంలో విహరించాలని ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఇటీవలి కాలంలో ప్రముఖ విమానయాన సంస్థలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విమాన టికెట్లపై ప్రత్యేక డిస్కౌంట్లతో స్పెషల్ సేల్స్ లాంఛ్ చేస్తున్నాయి. ఇటీవల .. ఇప్పుడు మరో ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కూడా అదే బాటలో మరో స్పెషల్ సేల్ తీసుకొచ్చింది. ఇండిగో కంటే తక్కువ ధరల్లోనే విమాన ప్రయాణం కల్పిస్తుండటం విశేషం. >> ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు పే డే సేల్ మళ్లీ తెచ్చింది. ఫిబ్రవరి 24నే టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవగా.. ఈ ఆఫర్ మార్చి 1 వరకు కొనసాగనుంది. ఆలోపు టికెట్లు బుక్ చేసుకున్న వారు.. ఈ ఏడాదిలో మార్చి 3 నుంచి అక్టోబర్ 8 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేసే వీలు కల్పిస్తోంది ఎయిరిండియా విమానయాన సంస్థ. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో బుకింగ్ చేసుకున్న వారికి ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా.. ఎక్స్‌ప్రెస్ లైట్ ఫేర్స్ దేశీయ రూట్లలో చూస్తే రూ. 1450 నుంచి టికెట్ ధర ప్రారంభమవుతోంది. ఎక్స్‌ప్రెస్ లైట్ ఆఫర్ కింద ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో కనీస టికెట్ ధర రూ. 6655 నుంచి మొదలవుతోంది. ఇక ఎక్స్‌ప్రెస్ వాల్యూ ఫేర్స్ డొమెస్టిక్ ఫ్లైట్లలో కనీసం రూ. 1500 నుంచి ప్రారంభమవుతుండగా.. ఇక్కడ అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు కనీస టికెట్ ధర రూ. 6,735 గా ఉంది. ఇంకా ఇక్కడ ఎలాంటి కన్వీనియెన్స్ రుసుము వసూలు చేయట్లేదు. పూర్తి వివరాల కోసం . ఆఫర్‌లోని టికెట్ ధరల్లో.. బేస్ ఫేర్, టాక్స్‌లు, ఎయిర్‌పోర్ట్ ఛార్జీలు కలిసే ఉంటాయి. కన్వీనియెన్స్ ఫీజు, ఇతర సర్వీస్ ఛార్జీలు ఇందులో ఉండవు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కాబట్టి.. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన సీట్లు కేటాయించడం జరుగుతుంది. అంటే ముందుగా వచ్చిన వారికి సీట్లు లభించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకా సీట్లు కూడా పరిమిత సంఖ్యలోనే ఈ ఆఫర్‌కు కేటాయిస్తారు కాబట్టి.. అన్ని డేట్లు, అన్ని ఫ్లైట్స్, అన్ని రూట్లలో అన్ని సీట్లు అందుబాటులోకి రాకపోవచ్చు.