. చేసి స్టేడియంలో బౌండరీల వర్షం కురిపిస్తే.. శ్రీలంక కెప్టెన్ సిక్సర్ల మోతతో శివతాండవం ఆడాడు. 147 పరుగులు అయినా క్రాస్ చేస్తుందా అన్న దగ్గరి నుంచి 213 పరుగులు బాదేస్తుందేమో అన్న హైప్ తీసుకొచ్చాడు. ఆఖరి రెండు బంతులు డాట్‌లు కావడంతో లంక ఓడిపోయి, పాక్ గెలిచింది. శనక విధ్వంసంతో . పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ ఫ్యాన్స్ మనస్సులు గెలిచాడు. గ్రూప్ స్టేజ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీలంక సూపర్ 8లో మాత్రం చతికిలపడింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌పై దారుణ ఓటములు ఎదుర్కొన్న లంక, తమ దేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ ఆఖరి మ్యాచ్‌లో మాత్రం పాకిస్తాన్‌ను భయపెట్టింది. టోర్నీని ఓటమితో ముగించినా ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీ అయ్యారు. 15 ఓవర్లకు శ్రీలంక స్కోర్ 135/5‌గా ఉంది. విజయం సాధించాలంటే ఆఖరి 5 ఓవర్లలో 78 పరుగులు చేయాలి. అది అసాధ్యం అని అందరూ అనుకున్నారు. కానీ 16వ ఓవర్ దగ్గర నుంచి శనక ఊచకోత కోశాడు. 16, 17, 18 ఓవర్లలో ఒక్కొక్క సిక్సర్ బాదిన శనక.. 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఆఖరి ఓవర్‌లో ఏకంగా హ్యాట్రిక్ సిక్సర్లతో మ్యాచ్‌ని గెలిపించినంత పనిచేశాడు. ఆఖరి ఓవర్‌లో శ్రీలంక విజయం సాధించాలంటే 28 పరుగులు అవసరం అయింది. షాహీన్ అఫ్రిది వేసిన ఆ ఓవర్‌లో ఫోర‌తో మొదలుపెట్టిన శనక, వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదాడు. ఆఖరి రెండు బంతుల్లో మరో 6 పరుగులు చేస్తే శ్రీలంక గెలిచేది. కానీ ఆ రెండు బంతులను అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్‌గా వేసి అఫ్రిది డాట్స్ చేశాడు. దాంతో శ్రీలంక 207/6 పరుగులు మాత్రమే చేయగలిగింది. శనక 31 బంతుల్లో రెండు ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచి లంక అభిమానుల మనస్సులు గెలుచుకున్నాడు.