. అదిరిపోయే ఆరంభం ఇచ్చినా.. ఫినిషింగ్ సరిగా లేకపోవడంతో . శ్రీలంకపై మ్యాచ్ గెలిచినిప్పటికీ నెట్ రన్‌రేట్ కారణంగా ఈ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 250 మార్క్‌ను టచ్ చేస్తుందని అందరూ అనుకున్నారు.. ఆఖర్లో వరుస వికెట్లు పడటంతో భారీ స్కోర్ చేయలేకపోయింది. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన పాకిస్తాన్ జట్టు తాడో పేడో తేల్చుకోవాలి అన్నట్టే ఆడింది. తో పాక్‌లో సెమీస్ ఆశలు రేకెత్తించారు. ఈ ఇద్దరూ రికార్డు స్థాయిలో తొలి వికెట్‌కు 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 15.5 ఓవర్లకు 176 పరుగులు చేసిన పాకిస్తాన్, 20 ఓవర్లలో 250 మార్క్‌ను టచ్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఫఖర్ జమాన్ అవుటవ్వగానే సీన్ మొత్తం మారిపోయింది. మిగతా బ్యాటర్లు నిలకడగా రాణించకుండా భారీ షాట్లకు ప్రయత్నించి వచ్చినోడు వచ్చినట్టే పెవిలియన్ బాట పట్టాడు. సెంచరీ చేసిన తర్వాత అప్పటివరకు క్రీజులో ఉన్న ఫర్హాన్ కూడా అవుటవ్వడంతో పాక్ ఛాప్టర్ క్లోజ్ అయింది. 176 పరుగులకు తొలి వికెట్ పడగా, 210 పరుగులకే 8 వికెట్లను కోల్పోయింది. అంటే కేవలం 34 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఆఖరి నాలుగు ఓవర్లలో పాకిస్తాన్ చేసింది కేవలం 35 పరుగులు మాత్రమే. పాకిస్తాన్ బ్యాటర్లు ఆఖరి నాలుగు ఓవర్లలో విఫలమవ్వడం.. బౌలర్లు శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేయడంలో ఫెయిల్ అవ్వడంతో పాక్‌ ఈ టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. శ్రీలంక జట్టును 147 పరుగుల లోపు కట్టడి చేసి ఉంటే పాకిస్తాన్ సెమీస్‌కు వెళ్లుండేది. కానీ పాక్ బౌలర్లను తట్టుకున్న శ్రీలంక టాప్ ఆర్డర్ వాళ్ల సెమీస్ ఆశలపై నీళ్లు చల్లారు. ఆఖర్లో లంక కెప్టెన్ దాసున్ శనక విధ్వంసం సృష్టించి ఆల్‌మోస్ట్ గెలిపించినంత పని చేశాడు. కానీ, ఆఖరి రెండు బంతులు డాట్ కావడంతో ఓడిపోయారు. పాక్ 212/8 పరుగులు చేస్తే శ్రీలంక 207/6 పరుగులు చేసింది. దాంతో పాక్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.