భారత్‌పై అమెరికా-ఇరాన్ దాడుల ప్రభావం.. పెట్రోల్ ధరలు పెరుగుతాయా? నిపుణల అంచనాలివే

Wait 5 sec.

US-Iran Attacks: ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేశాయి. దీంతో పశ్చిమాసియాలో భద్రతాపరమైన ఆందోళనలను తీవ్రతరం చేశాయి. ఈ భౌగోళిక రాజకీయ పరిణామాలు ఆ ప్రాంతాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపించనున్నాయి. అలాగే భారత ఇంధన భద్రత, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించనున్నాయి. వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. భారత్ తన క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో సగానికిపైగా పైగా ఈ జలసంధి నుంచే తీసుకువస్తోంది. దీంతో ఈ అంశం తీవ్ర ఆందోళనలు కలిగిస్తోంది. ఇక్కడ రవాణాకు ఏ మాత్రం ఆంటంకం ఏర్పడినా ఇంధన, సరకు రవాణా వ్యయాలు భారీగా పెరుగుతాయి. భారత ఆర్థిక వ్యవస్థపై ఇది పెను భారాన్ని మోపనుంది. ఇరాన్‌ను ఒమన్, యూఏఈల నుంచి వేరు వేసే ఈ హార్ముజ్ జల సంధి నుంచే ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 శాతం మేర ఉంది. కేప్లర్ రిపోర్ట్ ప్రకారం 2025 చివరి నాటికి 40 శాతంగా ఉన్న భారత ఆయిల్ దిగుమతులు 2026 జనవరి- ఫిబ్రవరి నాటికి 50 శాతానికి పెరిగాయి. అమెరికా ఆంక్షలతో రష్యా నుంచి ఆయిలు కొనుగోళ్లను భారత్ తగ్గించింది. మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం భారత్ రోజుకు 26 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ ఇరాన్, సౌదీ, యూఏఈ, కువైట్ నుంచి ఈ హార్ముజ్ జల సంధి నుంచే దిగుమతి చేసుకుంటోంది. రోజుకు 74 వేల బ్యారెళ్ల శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులనూ భారత్ ఈ జల సంధి నుంచి ఎగుమతి చేస్తోంది. పెట్రోల్ ధరలు పెరుగుతాయా?అమెరికా బలగాల మోహరింపుతోనే క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 10 శాతం పెరిగాయి. ఈక్విటస్ సెక్యూరిటీస్ రిపోర్ట్ ప్రకారం ఒక వేళ రోజుకు 33 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లియతే బ్యారెల్ ధర 9-15 శాతం పెరిగి 76-81 డాలర్లకు చేరింది. హార్ముజ్ జల సంధికి పాక్షిక ఆటంకం ఏర్పడితే అదనంగా 20-40 శాతం పెరిగి ఏకంగా 95-110 డాలర్లకు చేరుకునే ముప్పు ఉందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా సరకు రవాణా ఖర్చులు పెరిగేందుకు అవకాశం ఉంది. ఎర్ర సముద్రంలో భద్రత లేకపోతే నౌకలు ఆఫ్రిగా మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో సరకు రవాణా సమయం 15-20 రోజులు అవుతుంది. దీంతో ఖర్చు 50 శాతం వరకు పెరుగుతంది. ఇవన్నీ అంతిమంగా వినియోగదారుడిపైనే పడతాయి. ఇదే కాకుండా ఇరాన్, ఇజ్రాయెల్, కువైట్ తదితర దేశాల గగనతలాలు పాక్షికంగా మూసివేశారు. దీంతో ఎయిర్ ఇండియా, ఇండిగో విమాన కంపెనీలు అమెరికా, ఐరోపా రూట్లను మళ్లించాయి. దీంతో ఇంధ ఖర్చుల ప్రభావం కనిపిస్తుంది. దీంతో విమాన టికెట్ల ధరలు భారీగా పెరగవచ్చు. బంగారం ధరలపై ప్రభావంఅమెరికా- ఇరాన్ దాడుల ప్రభావం బంగారం, వెండిపైన కనపడుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న క్రమంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి వైపు చూస్తారు. బంగారంలో ఒక్కసారిగా పెట్టుబడులు పెరగడంతో ధరలు పెరుగుతాయి. తాజా పరిణామాలతో బంగారం, వెండి రేట్లు జనవరిలో నమోదైన ఆల్ టైమ్ హై స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సమీపకాలంలో ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ పసిడి కాంట్రాక్ట్ 10 గ్రాములకు రూ.1.70 లక్షలు, కిలో వెండి రూ.3 లక్షలు దాటవచ్చని ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ అంచనా వేసింది.