. ముఖ్యంగా ఆల్‌రౌండర్ చెత్త బౌలింగ్‌‌తో ప్లేయర్స్‌నే కాదు, అభిమానులకు కూడా చిరాకు తెప్పించాడు. ఆఖరి ఐదు ఓవర్లలో దూబేతో బౌలింగ్ చేయించి సూర్య చాలా తప్పుచేసినట్టయ్యాడు. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన భారత్ - జింబాబ్వే మ్యాచ్‌లో అందరూ ఊహించినట్టే టీమిండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు బాదింది. టీమిండియా టార్గెట్ చూసిన అందరూ జింబాబ్వేపై వందకి పైగా పరుగుల తేడాతో ఘన విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ జింబాబ్వే బ్యాటర్ల పోరాటంతో 72 పరుగుల తేడాతో మాత్రమే గెలిచింది. జింబాబ్వే 184/6 పరుగులు చేయడానికి ముఖ్య కారణం దూబే అనే చెప్పొచ్చు. మ్యాచ్ 15వ ఓవర్‌లో బౌలింగ్ చేసిన దూబే చాలా చెత్తగా బంతులు వేశాడు. ఆ ఓవర్‌లో మూడు వైడ్లు, ఒక నో బాల్‌తో కలిపి ఏకంగా 10 బంతులు వేశాడు. అందులో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు ఉన్నాయి. ఆ ఓవర్‌లో మొత్తాన్ని బ్రియాన్ బెన్నెట్ ఆడటం విశేషం. ఈ ఒక్క ఓవర్‌లోనే దూబే 2, 6, 4, 4, Wd, 0, N, Wd, Wd, 6 తో 26 పరుగులు సమర్పించుకున్నాడు. దూబే తాను వేసిన మొదటి ఓవర్‌లో 26 పరుగులు ఇచ్చినా.. కెప్టెన్ సూర్య అతనితోనే ఆఖరి ఓవర్ కూడా వేయించాడు. 20వ ఓవర్‌ని కూడా దూబే అంతే బౌలింగ్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సీఎస్కే తరఫున ఆడుతున్న దూబేకి చెపాక్ హోం గ్రౌండ్ అయినప్పటికీ ఇంత దారుణంగా బౌలింగ్ చేయడం ఏంటని నోళ్లు తెరిచారు. ఆఖరి ఓవర్‌లో కూడా ఒక వైడ్, ఒక నో బాల్‌తో కలిపి 8 బంతులు వేశాడు. 1, N, Wd, 6, W, 1, 6, 4తో కలిపి 20 పరుగులు ఇచ్చాడు. దాంతో రెండు ఓవర్లలో దూబే 1 వికెట్ తీసి 46 పరుగులు ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాకి చెరొక ఓవర్ ఉన్నప్పటికీ దూబే‌తో రెండు ఓవర్లు బౌలింగ్ చేయించి కెప్టెన్ సూర్య భారీ మూల్యాన్నే చెల్లించుకున్నాడు. సౌతాఫ్రికా మీద కూడా దూబే భారీ పరుగులు సమర్పించుకోవడం విశేషం. వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్ నేపథ్యంలో ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ అభిమానుల్లో ఒకింత భయాన్ని పుట్టిస్తోంది.