: దేశంలోని . ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు ఇప్పటికే ఇతర చాలా బ్యాంకుల్లో వాటాల్ని కలిగి ఉన్నాయి. ఇటీవల జపాన్ బ్యాంకింగ్ కార్పొరేషన్ సుమిటోమో మిత్సుయ్‌ యెస్ బ్యాంకులో వాటా కొనుగోలు చేస్తే.. అందులో ఎస్బీఐ సహా ఇతర బ్యాంకులు వాటా విక్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్.. మరో ప్రైవేట్ బ్యాంకులో వాటాను కొనుగోలు చేయనుంది. బంధన్ బ్యాంకులో సుమారు 9.99 శాతం వాటా కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు ఆర్బీఐ తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గురువారం రోజు స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది.>> 2026, ఫిబ్రవరి 25న తమ బ్యాంకులో కనీసం 9.99 శాతం వరకు పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ లేదా వోటింగ్ రైట్స్ ద్వారా వాటా విక్రయానికి ఆర్బీఐ అనుమతులు ఇచ్చిందని.. బంధన్ బ్యాంకు గురువారం రోజు స్టాక్ ఎక్స్చేంజీలకు వెల్లడించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం- 1949 కు అనుగుణంగా.. ఇక్కడ నియమ నిబంధనలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇక్కడ ఆర్బీఐ అనుమతులు ఇచ్చిన తేదీ నుంచి సంవత్సరం లోపు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్.. సదరు బ్యాంకులో మెజార్టీ వాటాను కొనుగోలు చేయకపోతే అనుమతులు రద్దవుతాయని పేర్కొంది. ఇదే సమయంలో బంధన్ బ్యాంకులో.. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాటా ఎట్టి పరిస్థితుల్లోనూ 9.99 శాతం అధిగమించొద్దని.. ఇది పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ లేదా వోటింగ్ రైట్స్ ఎలా ఉన్నా వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది. ఇంకా ఫండ్ హౌస్ హోల్డింగ్ ఏ పరిస్థితుల్లోనైనా 5 శాతం కంటే తక్కువగా ఉంటే.. మరో 5 శాతం వరకు మళ్లీ పెంచుకునేందుకు కూడా ఆర్బీఐ ముందస్తు అనుమతులు తప్పనిసరి అని ఎక్స్చేంజి ఫైలింగ్‌లో పేర్కొంది.ఆర్బీఐ నుంచి బ్యాంకులో వాటా విక్రయానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో గురువారం సెషన్‌లో బంధన్ బ్యాంక్ షేర్ ధర పుంజుకుంది. అంతకుముందు రోజు రూ. 182.88 వద్ద ముగియగా ఫిబ్రవరి 26న నేరుగా లాభాల్లో ఓపెన్ అయింది. ఇంట్రాడేలో 4 శాతం వరకు పెరిగి రూ. 190.23 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 2 శాతం లాభంతో రూ. 186.11 వద్ద స్థిరపడింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 192.48 కాగా.. కనిష్ఠ ధర రూ. 134.06 గా ఉంది. మార్కెట్ విలువ రూ. 29.97 వేల కోట్లుగా ఉంది. నెల రోజుల్లోనే ఈ స్టాక్ ధర 25 శాతం పెరిగింది.