ఈ ప్రభుత్వ బ్యాంకులో కొత్త వడ్డీ రేట్లు.. 444 రోజులపై అధిక వడ్డీ.. 5 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది?

Wait 5 sec.

Pnb FD rates: ప్రభుత్వ రంగంలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కీలక ప్రకటన చేసింది. తమ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్లను ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అమలులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త రేట్లు రూ.3 కోట్ల కంటే తక్కువ ఉండే రిటైల్ డిపాజిట్లకు వర్తిస్తాయని తెలిపింది. వడ్డీ రేట్ల సవరణ తర్వాత ఈ బ్యాంకు ఇప్పుడు సాధారణ డిపాజిటర్లకు 3 శాతం నుంచి 6.60 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే 3.50 శాతం నుంచి 7.10 శాతం మేర వడ్డీ అందిస్తోంది. ఇక సూపర్ సీనియర్ సిటిజన్లకు 3.80 శాతం నుంచి 7.40 శాతం వరకు వడ్డీ రేటు ఇస్తోంది.సాధారణ ప్రజలకు 6.60 శాతం వడ్డీ ఇస్తుండగా సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం మేర వడ్డీ ఇస్తోంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే 7.40 శాతం వడ్డీ అందిస్తోంది. ఇతర ప్రభుత్వ బ్యాంకుల్లోని 444 రోజుల టెన్యూర్ల డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు పంజాబ్ నేషనల్ బ్యాంకులోనే ఉండడం గమనార్హం. మరి ఇందులో రూ.5 లక్షలు జమ చేసినట్లయితే ఎంతొస్తుందో ఆన్ లైన్ కాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణ కస్టమర్ జమ చేసినట్లయితే మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ.5,40,000 వరకు వస్తాయి. అదే సీనియర్ సిటిజన్ అయితే చేతికి రూ. 5,43,000 వరకు లభిస్తాయి. అదే 80 ఏళ్ల వయసు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్ అయితే చేతికి రూ. 5,45,000 వరకు అందుతాయి. ఇతర బ్యాంకుల్లో ఎఫ్డీ రేట్లు అధిక వడ్డీ ఇస్తోంది. జనరల్ కస్టమర్లకు అయితే 6.45 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే 7.05 శాతం వడ్డీ ఇస్తోంది. 2026 జనవరి 5 నుంచే ఈ కొత్త రేట్లను అమలులోకి తెచ్చింది. ఇండియన్ బ్యాంకులో ఇండ్ సెక్యూర్ 444 డేస్ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ ద్వారా సాధారణ పౌరులకు 6.45 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం, సూపర్ సీనియర్లకు 7.20 శాతం వడ్డీ ఇస్తోంది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఈ రేట్లు అమలులోకి వచ్చాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా‌లో అమృత్ వృష్టి స్పెషల్ ఎఫ్డీ ద్వారా గరిష్ఠ వడ్డీ ఆఫర్ చేస్తోంది. సాధారణ పౌరులకు 6.45 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం వడ్డీ ఇస్తోంది.కెనరా బ్యాంకులో 444 రోజుల స్పెషల్ ఎఫ్డీ ద్వారా సాధారణ పౌరులకు 6.45, సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం వడ్డీ అందిస్తోంది. జనవరి 5 నుంచే కొత్త వడ్డీ రేట్లు అములోకి తెస్తోంది.