శ్రీశైలం మల్లన్న భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఉగాదికి దర్శనాలు రద్దు చేశారు, గమనించండి

Wait 5 sec.

శ్రీశైలం మల్లన్న భక్తులకు ముఖ్యమైన గమనిక. ఉగాదికి దర్శన కోసం వెళుతున్నారా.. అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి. ఈ నెల 16 నుంచి 20 వరకు ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంలో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనాలు పూర్తిగా రద్దు చేసినట్లు పాలకమండలి ఛైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఆ ఐదు రోజుల పాటూ భక్తులకు అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. టీటీడీ ఈవో, పాలకమండలి ఛైర్మన్ ఆధ్వర్యంలో శ్రీశైలంలోని పరిపాలనా భవనంలో కర్ణాటకకు చెందిన 63 భక్త బృందాలు, స్వచ్ఛంద సేవా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అలాగే ప్రతి స్లాటుకు 1,500 టిక్కెట్లు కరెంట్‌ బుకింగ్‌, ఆన్‌లైన్‌లో 500 టిక్కెట్లు.. మార్చి 6 నుంచి 15వ తేదీ వరకు రోజుకు నాలుగు విడతలుగా భక్తులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని.. ప్రతిశాఖ సమన్వయంతో ముందుకు సాగాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఉగాది సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తారని.. గతేడాది ఉగాదికి 7 లక్షల మంది భక్తులు వచ్చారని.. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో రద్దీ ఉంటుందన్నారు. నేటి (సోమవారం) నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతి ఉంటుందని గుర్తు చేశారు. భక్తుల కోసం 4 నుంచి 5 లక్షల వాటర్ బాటిల్స్ సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ నెల 8 నుంచి పార్కింగ్ ఏరియా, పాదయాత్ర మార్గాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాదు పారిశుద్ధ్య పనుల్ని ఆర్‌డబ్ల్యుఎస్‌, పంచాయతీ రాజ్‌ శాఖలు సమన్వయంతో పర్యవేక్షించాలని సూచించారు. పార్కింగ్ ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని.. ఒకవేళ ఏవైనా వాహనాలు మొరాయిస్తే వెంటనే తరలించేలా క్రేన్లు, టోయింగ్‌ వాహనాలు మెకానిక్స్‌తో సహా సిద్ధంగా ఉంచాలి అన్నారు. అంతేకాదు భక్తులు స్నానాలు ఆచరించే లింగాలగట్టు, పాతాళగంగా దగ్గర ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. భక్తుల కోసం శ్రీమే ఐ హెల్ప్‌ యూశ్రీ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాదు నిత్యావసర వస్తువులు అధిక ధరలకు అమ్మకుండా పర్యవేక్షించాలన్నారు. ప్రతి రోజూ 8వేల నుంచి 2 వేలమందికి స్లాట్ (ఒక్కో స్లాట్ 2 గంటల పాటూ) విధానంలో దర్శనం కల్పించాలన్నారు. ఎనిమిది గంటలు స్లాట్ దర్శనం ఉండేలా ప్లాన్ చేశామన్నారు. మిగిలిన సమయంలో ఉచితం దర్శనం కొనసాగుతుంది అన్నారు. భక్తుల కోసం వాలంటీర్లను నియమించాలని నిర్ణయించారు. అలాగే కన్నడ మాట్లాడే పోలీసుల్ని విధుల్లో ఉంచేలా ప్లాన్ చేశామన్నారు.