ఏపీలో పేదలకు ఉగాది కానుక.. చంద్రబాబు కీలక ప్రకటన

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు తీపికబురు చెప్పారు.. ఉగాది పండుగకు కానుకను ప్రకటించారు. ఈసారి ఉగాదికి రెండు రోజుల ముందు 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 3 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేసి, గృహప్రవేశాలు చేయించామని గుర్తు చేశారు. అంతేకాదు ఈ ఏడాది జూన్‌ నాటికి మరో 2.50 లక్షలు, సెప్టెంబరు నెల నాటికి మరో 2.10 లక్షలు పూర్తి చేసి చేస్తామని తెలిపారు. ఏపీ అసెంబ్లీలో గృహనిర్మాణశాఖ బడ్జెట్‌ పద్దులపై చర్చలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 లక్షల మంది ఇప్పటికే సొంతింటి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఒకవేళ రాష్ట్రంలో ఇంకా ఎవరైనా అర్హులుంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్లు నిర్మించే బాధ్యత తీసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం అర్హులందరికీ 2029 నాటికి ఇళ్ల స్థలాలిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అర్హుల ఎంపిక ప్రారంభించామని.. 2.20 లక్ష మందికి ఇంటి స్థలాలు లేనట్లు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అందరికి అవకాశం ఇస్తామని.. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ ఎక్కడైనా స్థలాలు లేకపోతే జీ+2 తరహాలో ఇళ్ల నిర్మాణాల చేపడతామన్నారు.204-2019లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కొంతమంది ఇళ్ల నిర్మాణం చేపట్టారని.. అయితే గత ప్రభుత్వ హయాంలో వారిలో 2.70 లక్షలమంది ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వారందరికి డబ్బులు చెల్లించలేదని.. వారికి మొత్తం రూ.913 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. త్వరలోనే వారికి సాయం చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలకు భూ సేకరణ, ఇళ్ల నిర్మాణాలలో అక్రమాలు, అవినీతి జరిగిందని.. దీనిపై విచారణ జరుగతోందన్నారు. అవినీతి జరిగిందని తేలితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని.. ఈ విషయంలో రాజీపడేది లేదని.. తప్పు చేసిన ఎవరూ తప్పించుకోలేరన్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానాన్ని దుర్వినియోగం చేశారని.. ఈ అంశంపై కూడా విచారణ జరుగుతోందన్నారు. తప్పు చేసిన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.