పసిడి ప్రియులకు అలర్ట్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం గోల్డ్ రేటు ఎంతుందంటే?

Wait 5 sec.

Latest Gold Silver Rates: ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో భారత్ ముందు వరుసలో ఉంటుంది. ఎక్కువగా భారత్.. బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. కానీ ఇటీవల కొంత కాలంగా బంగారం దిగుమతులు తగ్గిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో గోల్డ్ రేట్లు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇటీవల వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. ఇప్పటికీ ఆల్ టైమ్ గరిష్ఠాలకు కాస్త దూరంగానే ఉన్నప్పటికీ.. రేట్లు చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. గతేడాది నుంచి భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఇటీవల జనవరి ఆఖర్లో.. ఫిబ్రవరి నెల ప్రారంభంలో తగ్గగా మళ్లీ కొన్ని రోజులకు పుంజుకున్నాయి. దీనికి ఫిబ్రవరి 26 -27 న బ్రేక్ పడగా.. మళ్లీ ఇవాళ ధర పుంజుకుంది. వెండి రేటు ప్రస్తుతం స్థిరంగానే కొనసాగుతోంది.దేశీయంగా చూస్తే హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పుత్తడి ధర ఇవాళ రూ. 500 పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,48,100 వద్ద ఉంది. దీనికి ముందటి రోజు ఇది రూ. 800 తగ్గుముఖం పట్టింది. దానికి ముందు దాదాపు వారం రోజులు పసిడి ధర పెరుగుతూనే వచ్చింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే ఇవాళ రూ. 550 ఎగబాకి తులం రూ. 1,61,570 కి చేరింది. ముందటి రోజు ఇది రూ. 870 తగ్గింది. బంగారం ధర పెరిగినప్పటికీ మరోవైపు దేశీయంగా సిల్వర్ రేటు స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 2.95 లక్షలుగా ఉంది. ఫిబ్రవరి 18న రూ. 2.60 లక్షల వద్ద ఉండగా.. 10 రోజుల్లోనే అక్కడి నుంచి రూ. 35 వేల వరకు పెరిగిందని చెప్పొచ్చు. ఆల్ టైమ్ హై వాల్యూ చూస్తే జనవరి 29న కేజీకి రూ. 4.25 లక్షలు పలికింది. అక్కడి నుంచి చూస్తే ఇంకా రూ. 1.30 లక్షల దూరంలోనే ఉంది. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు రాత్రికి రాత్రే భారీగా పెరిగాయి. చాలా రోజులకు ఇంతలా పెరిగిందని చెప్పొచ్చు. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 5,280 డాలర్ల స్థాయిలో ఉంది. కిందటి రోజు ఇది 5,150 డాలర్ల స్థాయిలో ఉండేది. సిల్వర్ రేటు కూడా 88 డాలర్ల స్థాయి నుంచి 94 డాలర్లకు ఎగబాకింది. దీనికి అనుగుణంగా శనివారం (ఫిబ్రవరి 28) ఉదయం 10 గంటల తర్వాత దేశీయంగా బంగారం, మరింత పెరగనున్నాయని చెప్పొచ్చు.