లు రోజురోజుకు ఆసక్తికరంగా మారాయి. సెమీ ఫైనల్స్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రతి మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో ఈ రోజు మధ్య మ్యాచ్ జరగనుంది. గ్రూప్ 2లో భాగంగా జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్ల భవితవ్యాన్ని తేల్చనుంది. శ్రీలంక ఓడితే ఇంటిదారి పట్టనుండగా.. న్యూజిలాండ్ గెలిస్తే సెమీస్ అవకాశాలు బలపరుచుకోనుంది. సూపర్ 8లో భాగంగా న్యూజిలాండ్ - శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ సెమీ ఫైనల్ బెర్త్‌కు మార్గాన్ని చూపనుంది. ఇప్పటికే గ్రూప్ 2 నుంచి వరుస విజయాలతో ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టగా.. రెండో స్థానం కోసం న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్ ఎదురుచూస్తున్నాయి. న్యూజిలాండ్ గెలిస్తే సెమీస్ ఆడే అవకాశాలు ఉండగా.. శ్రీలంక ఓడితే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయినట్టే. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుండగా.. మ్యాచ్ లైవ్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. గ్రూప్ 2 సూపర్ 8లో న్యూజిలాండ్ తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆడకుండానే కివీస్‌కు ఒక పాయింట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే మూడు పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగనుంది. చివరగా ఇంగ్లండ్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ గెలిస్తే టేబుల్ టాప్‌గా నిలిచి సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టొచ్చు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధిస్తే ఆ జట్టు రెండు పాయింట్లు వస్తాయి. సూపర్ 8లో పాకిస్తాన్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లోనూ లంక గెలిస్తే సెమీ ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవచ్చు. అలా కాకుండా న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోతే ఇంటిదారి పట్టడం ఖాయం.శ్రీలంక మ్యాచ్‌లో గెలిచి, ఇంగ్లండ్‌పై ఓడిపోతే న్యూజిలాండ్ జట్టుకు మూడు పాయింట్ల వస్తాయి. అదే సమయంలో శ్రీలంక - పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ విజయం సాధిస్తే పాకిస్తాన్‌కూ మూడు పాయింట్లు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో నెట్ రన్‌రేట్ కీలకంగా మారుతుంది. మొత్తానికి సెమీ ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ - శ్రీలంక మ్యాచ్ చాలా కీలకంగా మారనుంది. శ్రీలంక జట్టు అంచనాపాతుమ్ నిస్సంక, కమిల్ మిషారా, కుశాల్ మెండిస్, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దాసున్ శనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుష్మన్ హఏమంత, దుష్మంత చమీరా, మహీష్ తీక్షణ, దిల్షాన్ మధుశంక. న్యూజిలాండ్ జట్టు అంచనాటిమ్ సైఫర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ ఛాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జేమ్స్ నీషమ్, మ్యాట్ హెన్రీ, ఇష్ సోడి, లాకీ ఫెర్గ్యూసన్.