టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ.. వైసీపీ సర్పంచ్ అరెస్ట్, 10 రోజుల్లోపే ఛేదించిన పోలీసులు

Wait 5 sec.

టీడీపీ ఎమ్మెల్యే, పొన్నూరు నియోజకవర్గం శాసనసభ్యుడులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రమీలా దేవి ఇంట్లో చోరీ కేసులో ఐదుగురు నిందితులను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. చోరీ కేసులో అరెస్టైన వారిలో ఏలూరు జిల్లా చాటపర్రు సర్పంచ్, వైసీపీ నేత గుడిపూడి రఘు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 42 సవర్ల బంగారం, 10.50 కిలోల వెండి ఆభరణాలు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాకు చెందిన సత్తెనపల్లి రాకేష్‌ దొంగతనాలు చేయటంలో ఆరితేరాడు. చోరీలు చేయటంలో చేయి తిరిగిన రాకేష్ మీద ఇప్పటికే 34 వరకూ కేసులు కూడా ఉన్నాయి. రాకేష్‌తో పాటుగా అతని స్నేహితులు ప్రకాశం జిల్లాకు ఆశీర్వాదం, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన డెయిన్‌కుమార్‌ అలియాస్‌ ఆశిష్, ఏలూరుకు చెందిన దుర్గాప్రసాద్, కృపాశామ్యూల్, దగ్గుమల్లి చినబాబు కలిసి ఫిబ్రవరి 15వ తేదీన చీరాల బీచ్‌కు వెళ్లారు. అక్కడ అదను చూసి కారు దొంగతనం చేశారు. ఫిబ్రవరి 16వ తేదీ ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలా దేవి ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడ రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత అదే రోజు ప్రమీలా దేవి ఇంట్లోకి ప్రవేశించి 42 సవర్ల బంగారం, పదిన్నర కిలలో వెండి నగలు, లక్ష నగదు చోరీ చేశారు. ఆ తర్వాత వీరంతా కలిసి తమకు పరిచయం ఉన్న చాటపర్రు సర్పంచి గుడుపూడి రఘు వద్దకు వెళ్లారు. అతనికి చోరీ చేసిన వెండి ఆభరణాలు విక్రయించారు. గుడిపూడి రఘు వెండి ఆభరణాలు కరిగించి వెండి ఇటుకలా మార్చారు. అయితే ఓ సరస్వతీ విగ్రహాన్ని మాత్రం కరిగించలేదు. పురాతన విగ్రహం కావటంతో అలాగే ఉంచినట్లు తెలిసింది. మరోవైపు ప్రధాన నిందితుడు అయిన రాకేష్ తల్లి.. చోరీ చేసిన బంగారు ఆభరణాలను దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు చోరీ జరిగిన ప్రదేశంలో దొరికిన వేలిముద్రలు, సాంకేతిక ఆధారాలతో పోలీసులు.. దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి చోరీ సొత్తును రికవరీ చేశారు.