పంతం నెగ్గించుకున్న ట్రంప్.. వెనక్కి తగ్గిన నెట్‌ఫ్లిక్స్.. పారామౌంట్ స్కైడ్యాన్స్‌కు లైన్ క్లియర్

Wait 5 sec.

Netflix: నెట్ ఫ్లిక్స్- వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మధ్య ఇటీవలే కుదిరిన ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ డీల్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వెనక్కి తగ్గింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సంబంధం ఉన్న పారామౌంట్ స్కైడాన్స్‌కు లైన్ క్లియర్ అయినట్లయింది. దీంతో ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నట్లయింది. మరి ఇంతకీ ఏం జరిగింది? వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కొనుగోలు కోసం జరిగిన ఒప్పందం నుంచి నెట్‌ఫ్లిక్స్ ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? అనే వివరాలు తెలుసుకుందాం. చేసేందుకు నెట్ ఫ్లిక్స్, కామ్ కాస్ట్ కార్పొరేషన్, పారామౌంట్ స్కైడాన్స్ కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ బిడింగ్ వార్‌లో మొదట నెట్ ఫ్లిక్స్ వైపు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మొగ్గు చూపించింది. వార్నర్ సంస్థను కొనుగోలు చేసేందుకు తాత్కాలిక ఒప్పందం సైతం కుదిరింది. కానీ, ఆ ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేశారు. భారీ మొత్తాన్ని కోట్ చేస్తూ పారామౌంట్ హాస్టైల్ బిడ్ వేసింది. దీంతో ఈ కొనుగోలులో సీన్ మొత్తం మారిపోయింది. మేనేజ్మెంట్ ఈ డీల్‌కు అనుకూలంగా లేనప్పుడు నేరుగా వాటాదారులు లక్ష్యంగా ఈ హాస్టైల్ బిడ్ వేస్తుంటారు. నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కంపెనీ చేసుకున్న తాత్కాలిక డీల్ ప్రకారం ఒక్కో షేరుకు 28 డాలర్లుగా నిర్ణయించారు. అయితే పారామౌంట్ 30 డాలర్లు చెల్లిస్తామని ఆఫర్ చేసింది. ఇదే తమకు బెట్ ఆఫర్ అని డబ్ల్యూబీడీ గురువారం ఓ ప్రకటన చేసింది. ఈ డీల్ చర్చల్లో భాగంగానే నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ వైట్ హైస్‌కు వెళ్లారు. ఆయన వెళ్లిన కొద్ది సమయానికే డబ్ల్యూబీడీ నుంచి ప్రకటన రావడం గమనార్హం. ఆ తర్వాత తాము ఈ డీల్ నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం నుంచి ప్రకటన వెలువడింది. ఇక కొత్త ఒప్పందం కుదిరితే సీఎన్ఎన్, కేబుల్ బిజినెస్, హెచ్‌బీఓ వంటి వ్యాపారాలన్నీ స్కైడ్యాన్స్ కిందకు వస్తాయి. నియంత్రణలోకి ఈ వ్యాపారాలు అన్నీ వెళ్లనున్నాయి. దీంతో రెండు హాలీవుడ్ స్టూడియోలు ఒకే గొడుగు కిందకు వస్తాయి. స్ట్రీమింగ్ సంస్థలు హెచ్‌బీఓ మ్యాక్స్, పారామౌంట్, రెండూ మీడియా సంస్థలు సీఎన్ఎన్, సీబీఎన్ కలిసి పని చేయనున్నాయి. అయితే ఈ డీల్ అమెరికాలో, విదేశాల్లో యాంటీ ట్రస్ట్ పరిశీలనను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.