ఇజ్రాయెల్‌లోని తమ రాయబార కార్యాలయం సిబ్బందికి ప్రయాణ కీలక సూచనలు చేశారు. దౌత్య సిబ్బందికి ఇజ్రాయెల్‌ను విడిచి వెళ్లాలనుకుంటే ఈ రోజు వెళ్లిపోవాలని సూచించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:24 గంటలకు పంపిన మెయిల్‌లో అమెరికాకు వెళ్లే ఏదైనా విమానం అందుకోవాలని తెలిపారు. దేశం నుంచి త్వరగా వెళ్లిపోవడమే మొదటి ప్రాధాన్యత అని మెయిల్‌లో పేర్కొన్నట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ‘ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. కానీ, ఇజ్రాయెల్‌ను వీడాలకునేవారు ఈ రోజే బయలుదేరాలి’ అని మైక్ హక్‌బీ పేర్కొన్నారు. నెలకున్న తరుణంలో ఈ మెయిల్ పంపడం గమనార్హం. మాపై దాడులు చేస్తే ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణిస్తామని, ఇదే జరిగితే వేలాది మంది అమెరికా భద్రతా సిబ్బంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఇరాన్ హెచ్చరించింది. అంతేకాదు, ఇజ్రాయెల్‌పై కూడా దాడి చేస్తామన్న ఇరాన్ హెచ్చరికలతో మరోసారి పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధం తప్పదనే సంకేతాలు పంపింది. ఇరాన్‌తో అణు ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్న అమెరికా.. దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధి కార్యక్రమాలను వెనక్కి తీసుకోవాలని, ఈ ప్రాంతంలో సాయుధ గ్రూప్‌లకు అందిస్తున్న మద్దతును ఆపేయాలని కోరుతోంది. ఇరాన్ మాత్రం కేవలం అణు అంశాలను మాత్రమే చర్చిస్తామని స్పష్టం చేస్తోంది. అంతేకాదు, తమ అణుకార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాలకు మాత్రమేనని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 19న ఇరాన్‌కు అణు ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ 15 రోజులు గడువు ఇచ్చారు.ఇరాన్‌ తన మూడు ప్రదాన అణు కేంద్రాలను మూసివేసి, శుద్ధిచేసిన యురేనియంను అమెరికా అప్పగించాలని ట్రంప్ చర్చల బృందం డిమాండ్ చేసినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ గురువారం నివేదించింది. ఇరాన్ శుక్రవారం మాట్లాడుతూ.. ఒప్పందానికి రావాలంటే, అమెరికా తన మితిమీరిన డిమాండ్లను విరమించుకోవాల్సి టుందని తేల్చిచెప్పింది. యుద్ధాన్ని నివారించడానికి చివరి ప్రయత్నంగా భావించిన చర్చల తర్వాత మొదలైన ఉద్రిక్తతలను తగ్గించాలని పేర్కొంది. గత జూన్‌లో ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయేల్ దాడులు చేపట్టడంంతో చర్చల కోసం మునపటి ప్రయత్నం విఫలమైంది.ఇదిలా ఉండగా, ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్ సందిగ్దంలో ఉన్నట్టు తెలుస్తోంది. దాడులు చేస్తే ఒక తలనొప్పి, చేయకుంటే మరో తలనొప్పిలా ఉంది ఆయన పరిస్థితి. చర్చలు విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరిస్తున్నా.. ఈ విషయంలో గట్టిగా చెప్పలేకపోతున్నారు. యురేనియం శుద్ధితోపాటు అణు నిల్వలపై ఇరాన్ కొంత దిగివచ్చేందుకు అంగీకరిస్తోంది. క్షిపణుల విషయంలో ససేమిరా అంటుంది.