పవన్ కళ్యాణ్‌కు జ్వరం.. కేబినెట్ భేటీకి దూరం!

Wait 5 sec.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో గడిచిన మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకానట్లు సమాచారం. ఉండటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం సభకు హాజరయ్యారు. కల్తీ నెయ్యి అంశం గురించి 15 నిమిషాల పాటు మాట్లాడారు. అయితే అసెంబ్లీ ముగిసిన తర్వాత జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ భేటీకి హాజరుకాలేదు. పవన్ కళ్యాణ్ అనారోగ్యం విషయం తెలుసుకున్న చంద్రబాబు.. విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేదు. మరోవైపు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ యాదవ్‌ కూడా కేబినేట్ భేటీకి హాజరు కానట్లు తెలిసింది. తిరుమల కల్తీ నెయ్యిపై పవన్ కళ్యాణ్ మరోవైపు శాసనసభలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై జరిగిన చర్చలో పవన్ కళ్యాణ్ పాల్గొ్న్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం అత్యంత తీవ్రమైన నేరమని అన్నారు ఈ నేరానికి పాల్పడిన బాధ్యులకు కఠిన శిక్ష పడాలని.. ఈ కేసులో దోషులను కూటమి ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరిగిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఎన్‌డీడీబీ నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెబితే, సీబీఐ సిట్ చేపట్టిన విచారణలో నెయ్యిలో అసలు నెయ్యే లేదని తేల్చిందని వెల్లడించారు. పామాయిల్, ఇతర రసాయనాలు కలిపి నెయ్యి తయారు చేసినట్టు ఆధారాలు లభించాయని.. ఇది శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేయడమేనని అన్నారు. హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు కులం, ప్రాంతం, భాషలకు అతీతంగా స్పందించకపోతే ఇలాంటి ఘటనలు కొనసాగుతూనే ఉంటాయన్నారు పవన్ కళ్యాణ్. తప్పు జరిగిందని తెలిసి దాన్ని సరిగా ముందుకు తీసుకువెళ్లకపోతే ఎలా అనే పశ్చాత్తాపంతో దీక్ష చేశానన్న పవన్ కళ్యాణ్.. ఎన్.డి.డి.బి. నివేదిక నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయని చెబితే అదే అంశాన్ని ట్వీట్ చేసినట్లు చెప్పారు. అప్పుడే దేవాలయాల పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు ప్రతిపాదన చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.