అఫ్గన్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు... ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేసిన తాలిబన్లు

Wait 5 sec.

అఫ్గనిస్థాన్, మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాలిబన్లే లక్ష్యంగా బహిరంగ యుద్ధం ప్రారంభమైనట్టు ఇస్లామాబాద్ ప్రకటించింది. సరిహద్దుల వెంబడి వివిధ విభాగాల్లో తాలిబన్ పోస్ట్‌లు, ప్రధాన కార్యాలయాలు, ఆయుధ డిపోలపై వైమానిక, భూ దాడులను నిర్వహించినట్టు పాకిస్థాన్ అధికారిక మీడియా వర్గాలను ఉటంకిస్తూ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమ సైన్యం భీకర దాడులతో భయపడిపోయిన .. తమ పోస్టుల వద్ద తెల్లజెండాలు పట్టుకుని ఊపారని నివేదించింది. అంతకు ముందు నిర్వహించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా, పాక్ దాడులతో రగిలిపోయిన తాలిబన్లు.. ప్రతీకారంగా ఆత్మాహుతి దళాలను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు అఫ్గన్‌లోని నంగర్‌హార్‌కు చెందిన ప్రభుత్వ మీడియా బఖ్తర్ న్యూస్ ఏజెన్సీ ఆత్మాహుతి దళం ఫోటోను పంచుకుంది. బాంబర్లు పేలుడు పదార్థాలు ఉన్న దుస్తులు, కారు బాంబులతో ప్రధాన లక్ష్యాలపై దాడులకు సిద్ధంగా ఉన్నారని అఫ్ఘన్ భద్రతా వర్గాలు చెప్పినట్లు పేర్కొంది.పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్యూరాండ్ రేఖ వెంబడి పక్తియా, పక్తికా, ఖోస్ట్ ప్రావిన్సులు సహా పలు ప్రాంతాల్లో తీవ్రమైన దాడులు, ప్రతీకార చర్యలు కొనసాగుతున్నట్టు తాలిబన్ డిప్యూటీ అధికార ప్రతినిది హమదుల్లా ఫిత్రాత్‌‌ పేర్కొన్నారని తెలిపింది. మరోవైపు, ఇరు దేశాలూ ప్రాణనష్టంపై పొంతనలేని లెక్కలు వెల్లడించడం గమనార్హం. తమ దాడిలో 133 మంది తాలిబన్ సైనికులు హతమయ్యారని, మరో 200 మందికిపైగా గాయపడ్డారని, 27 పోస్ట్‌లను ధ్వంసం చేశామని పాకిస్థాన్ ప్రకటించింది. అటు తాలిబన్లు కూడా 55 మంది పాక్ సైనికులు చనిపోయారని, 19 పోస్ట్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నంగర్‌హర్‌లో తమ సైనికులు 8 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 11 మంది గాయపడ్డారని, 13 మంది పౌరులకు గాయాలైనట్టు వెల్లడించారు.అఫ్గన్‌‌లో తాలిబన్లే లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల అనంతరం కాందహార్ గగనతలంలో పాక్ వైమానిక దళ యుద్ధ విమానాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్టు పీటీవీ పేర్కొంది. ఎటువంటి దాడులనైనా ఎదుర్కొడానికి పాక్ సాయుధ బలగాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. కాగా, తమ సహనం, ఓపిక ముగిశాయని, అఫ్గన్‌తో బహిరంగ యుద్ధం ఆరంభమైందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమూద్ తెలిపారు.తమ భూభాగంలో ఉగ్రవాదాన్ని తాలిబన్లు ప్రోత్సహిస్తున్నారని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అయితే, ఈ ఆరోపణలను ఖండించిన తాలిబన్ ప్రభుత్వం.. అది పాక్ అంతర్గత భద్రత వైఫల్యమని స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో పరిస్థితి ఉప్పు నిప్పులా ఉంది.