విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన దళపతి విజయ్ భార్య.. టీవీకే అధినేతకి నోటీసులు జారీ

Wait 5 sec.

కోలీవుడ్ స్టార్‌ హీరో విజ‌య్ రాజకీయాల్లో అడుగుపెట్టిన నేప‌థ్యంలో, గత కొన్నాళ్లుగా ఆయన వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలుస్తోంది. విజయ్ భార్య ఆయన్నుంచి విడాకులు తీసుకోనుందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. వాటిని నిజం చేస్తూ, విజయ్ భార్య సంగీత తాజాగా విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది.విజ‌య్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్ పట్టు జిల్లా కోర్టులో సంగీత పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్ కి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ కి వివాహేతర సంబంధం ఉందనే కారణంగానే సంగీత డివోర్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కిందని వార్తలు వస్తున్నాయి.విజయ్ - సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్యసాష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2023లో విజయ్ - సంగీత మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో వారిద్ద‌రు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. త్వరలోనే తమిళనాడులో ఎన్నికలు జరగనుండగా.. ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.