యెస్ బ్యాంకులో ఫ్రాడ్ ట్రాన్సాక్షన్లు.. 5 వేల మంది కస్టమర్ల డేటా లీక్

Wait 5 sec.

Yes Bank: ప్రైవేట్ రంగంలోని ప్రముఖ బ్యాంకుల్లో డేటా లీక్, మోసపూరిత లావాదేవీల ఘటనలు పెరుగుతున్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో ప్రభుత్వ అకౌంట్లలో నగదు అక్రమ బదిలీ ఉదంతం మరవకముందే మరో ప్రైవేట్ బ్యాంకులో అనధికారిక లావాదేవీలు జరిగినట్లు వెలుగులోకి రావడం గమనార్హం. జరిగినట్లు బ్యాంక్ గుర్తించింది. ఆయా కస్టమర్ల సీవీవీ చోరీ చేసి అనధికారికంగా ట్రాన్సాక్షన్లు చేసినట్లు బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరణ కోరినట్లు జాతీయ మీడియా సంస్థలు వార్తా కథనాలను ప్రచూరించాయి. యెస్ బ్యాంకు జారీ చేసిన మల్టీ కరెన్సీ ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను ఉపయోగించి దాదాపు 2,80,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.2.35 కోట్లు విలువైన ట్రాన్సాక్షన్లు జరిగినట్లు బ్యాంక్ గుర్తించింది. దాదాపు 5000 మంది కస్టమర్లకు చెందిన కార్డుల వివరాలను ఉపయోగించి ఈ ట్రాన్సాక్షన్లు జరిగినట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. లాటిన్ అమెరికా దేశం నుంచి ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 3.30 నుంచి 8.30 గంటల వరకు 15 మర్చంట్ అకౌంట్ల నుంచి ఈ ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఆ దేశంలో ఇ-కామర్స్ ట్రాన్సాక్షన్లకు 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేకపోవడం ఈ మోసానికి మూల కారణమని తెలిపింది. ట్రాన్సాక్షన్లు జరగకుండా యెస్ బ్యాంక్ నిలిపివేసింది. ఆపై కూడా అనధికార ట్రాన్సాక్షన్ల కోసం 688 ప్రయత్నాలు జరిగినట్లు యెస్ బ్యాంక్ తెలిపింది. మోసానికి గురైన కస్టమర్లకు ఎలాంటి ఆర్థిక నష్టం ఉండబోదని తెలిపింది. బ్లాక్ చేసిన కార్డుల స్థానంలో కొత్త ఫారెక్స్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ కార్డుల జారీలో భాగస్వామి అయిన బుక్ మై ఫారెక్స్ మాత్రం తమ వైపు నుంచి ఎలాంటి డేటా చోరీ జరగలేదని వివరణ ఇచ్చింది. తమ వద్ద సీవీవీ వంటి సున్నితమైన డేటా లేదని తెలిపింది. సీవీవీ డేటా ఉల్లంఘనపై వివరణ ఇవ్వాల్సిందిగా యెస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ లకు ఆర్‌బీఐ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.