షణ్ముఖ్ జశ్వంత్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు.. ఏడు ఫొటోలతో ఏడు అడుగులు

Wait 5 sec.

బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి బుల్లితెర ఆడియన్స్‌కి కొత్తగా చెప్పే పని లేదు. ఎందుకంటే తెలుగులో ఎన్నో కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌ల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్‌బాస్‌ సీజన్ 5లో అడుగుపెట్టి రన్నరప్‌గా బయటికొచ్చాడు. అయితే బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చాక పర్సనల్‌, కెరీర్ పరంగా కూడా షన్నుకి గట్టిగానే ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఈ ఏడాది మొదట్లో తాను మరోసారి ప్రేమలో పడ్డానని షన్ను కన్ఫార్మ్ చేసిన సంగతి తెలిసిందే.ఫేస్ రివీల్ చేయకుండా తన ప్రియురాలికి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ ఆ పోస్ట్ పెట్టాడు. తాజాగా తన ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఫొటోలని షేర్ చేస్తూ తనకి కాబోయే భార్య ఎవరో కూడా చెప్పాడు. ఫ్యామిలీ సమక్షంలో జరిగిన ఈ నిశ్చితార్థం ఫొటోలని షేర్ చేస్తూ షణ్ముఖ్ జశ్వంత్ లవ్స్ వైష్ణవి చోడిశెట్టి ఎంగేజ్‌డ్ అని క్యాప్షన్ ఇస్తూ ఈరోజు తేదీ పెట్టాడు. చివరిలో దేవుడి ప్లాన్ రివీల్ అయింది అంటూ షన్ను పెట్టాడు. వైష్ణవి కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అని సమాచారం.ఈ ఫొటోల్లో షన్ను, వైష్ణవి ఇద్దరూ చాలా క్యూట్‌గా ఉన్నారు.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అయితే బిగ్‌బాస్ బ్యాచ్ కానీ షన్ను క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎవరూ ఈ పోస్ట్ కింద కామెంట్ పెట్టలేదు. సాధారణంగా బిగ్‌బాస్ సెలబ్రెటీల ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా అందరూ తెగ కామెంట్లు పెడుతుంటారు. కానీ షన్ను నిశ్చితార్థం ఫొటోలు పెట్టినా కూడా బిగ్‌బాస్ సెలబ్రెటీలు ఎవరూ కామెంట్ చేయలేదు.బిగ్‌బాస్‌తో తలకిందులుబిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి ఎక్కువగా నష్టపోయిన వాళ్లలో షన్ను మొదటి వరుసలో ఉంటాడు. ఎందుకంటే ఆ సీజన్‌లో అడుగుపెట్టే సమయానికి తెలుగులో షన్ను యూట్యూబర్‌గా చాలా క్రేజ్‌లో ఉన్నాడు. అప్పటికే దీప్తి సునయనతో రిలేషన్‌లో కూడా ఉన్నాడు. అయితే హౌస్‌లోకి వెళ్లిన తర్వాత మరో యూట్యూబర్ సిరి హనుమంతుతో షన్ను క్లోజ్ అవ్వడం.. ఇద్దరూ తమకి వేరుగా లవర్స్ ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి వ్యవహరించడం చాలా నెగెటివ్ అయింది.ఈ దెబ్బతో విన్నర్ కావాల్సిన షన్ను కాస్తా రన్నరప్‌గా మిగిలిపోయాడు. హౌస్‌లో నుంచి ఇలా వచ్చిన వెంటనే తన ప్రేయసి దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత పలు వివాదాల్లో కూడా షన్ను వార్తల్లో నిలిచాడు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు, సిరీస్‌లు అంటూ బిజీ అవుతున్న షన్ను.. ఇలా ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.