‘వృషకర్మ’ నుంచి అదిరిపోయే పోస్టర్.. సాలిడ్ అప్‌డేట్ ఇచ్చిన నాగచైతన్య

Wait 5 sec.

యువ సామ్రాట్ అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చీ ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానుల కోసం తాజాగా ఓ అదిరిపోయే న్యూస్ అందించారు చైతూ.మార్చి ఫస్ట్ వీక్ లో ‘వృషకర్మ’ నుంచి ఓ అప్డేట్ రాబోతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వాటిని నిజం చేస్తూ మార్చి 5వ తేదీన గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "కార్తీక్ దండు అండ్ టీమ్ కలిసి ఒక సూపర్ ఎగ్జైటింగ్ విషయాన్ని సిద్ధం చేశారు.. ‘వృషకర్మ’ ప్రపంచాన్ని ఒక గ్లింప్స్ ద్వారా మీకు పరిచయం చేస్తాం" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ సర్ప్రైజింగ్ పోస్టర్ ను పంచుకున్నారు.‘వృషకర్మ’ కొత్త పోస్టర్ లో నాగ చైతన్య సాలిడ్ లుక్ లో కనిపిస్తున్నారు. చేతిలో ఆయుధం పట్టుకొని ఏదో అడ్వెంచర్ కోసం బయలుదేరిన యువకుడిగా యాక్షన్ మోడ్ లో ఇంటెన్స్ గా చూస్తూ కనిపించారు. చైతూ గెటప్, ఆయన హెయిర్ స్టైల్ కొత్తగా ఉన్నాయి. ఇది ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మార్చి 5న రాబోయే గ్లింప్స్ పై అంచనాలను రెట్టింపు చేస్తోంది. * నాగ చైతన్య కెరీర్ లో 24వ సినిమా 'వృషకర్మ'. 'తండేల్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన్నుంచి రాబోతున్న చిత్రమిది. మరోవైపు ‘విరూపాక్ష’ సినిమాతో దర్శకుడు కార్తీక్ దండు ఘన విజయం సాధించారు. అందుకే ట్రేడ్ వర్గాలు కూడా ఈ చిత్రం కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గ్లింప్స్ తో ఈ సినిమా నేపథ్యం ఏంటనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 'వృషకర్మ' చిత్రంలో నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రఘుల్ డి.హెరియన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బివిఎస్ఎన్ ప్రసాద్, ఇషాన్ సక్సేనా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.