ప్రధాని మోదీతో విజయ్-రష్మిక.. రిసెప్షన్‌కు ఆహ్వానం..

Wait 5 sec.

- రష్మిక గురువారం (ఫిబ్రవరి 26) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. వివాహ బంధంలో అడుగుపెట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వైభవంగా ఈ వివాహం జరిగింది. అయితే పెళ్లికి పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరైనప్పటికీ, రిసెప్షన్‌కు మాత్రం ఎక్కువమందికి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో విరోష్ రిసెప్షన్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్రమోదీని విజయ్‌, రష్మిక కలిశారు. తమ రిసెప్షన్‌కు రావాలని మోదీని ఆహ్వానించారు. ప్రధానితో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులను విరోష్‌ జోడీ ఆహ్వానించింది. బంజారా హిల్స్ లోని తాజ్‌ హోటల్‌ ఈ రిసెప్షన్‌ కు వేదిక కానుంది.