బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్.. హైదరాబాద్ తరలింపు..

Wait 5 sec.

వైసీపీ నేత, మాజీ మంత్రి అస్వస్థతకు గురయ్యారు. బొత్స సత్యనారాయణకు గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లుగా తెలిసింది. దీంతో బొత్స సత్యనారాయణను కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో బొత్స సత్యనారాయణను చేర్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బొత్స సత్యనారాయణకు చికిత్స కొనసాగుతోంది. మరోవైపు బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. బొత్స సత్యనారాయణకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు తెలిపారు.మరోవైపు బొత్స సత్యనారాయణ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు ఆయన కుమార్తె అనూష వెల్లడించారు. బీపీ ఎక్కువగా ఉండటంతో వైద్యులు పరీక్షలు చేస్తున్నారని వెల్లడించారు.