ఊహించన రీతిలో ఇరాన్ ప్రతీకారం.. దెబ్బకు బూర్జ్ ఖలీఫా ఖాళీ, దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేత

Wait 5 sec.

అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో రగిలిపోయిన ఇరాన్.. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది.ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాల రాజధానులైన దుబాయ్, రియాద్, అబుదాబీ, దోహా, మనామా నగరాలు వణుకుతున్నాయి. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లోని దుబాయ్‌పై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఆ దేశంలోని అన్ని విమానాశ్రయాలను మూసివేశారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అల్ ముక్తమ్ విమానాశ్రయాన్ని భద్రతా కారణాల రీత్యా మూసివేసినట్టు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది.ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణాలు సురక్షితం కాదని, తదుపరి సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను నేరుగా సంప్రదించాలని సూచించింది. పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉంటామని, సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తామని తెలిపింది. అటు, ప్రపంచంలోనే అత్యతం ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫాను సైతం ఖాళీ చేయించారు. ఇరాన్ భీకర దాడులతో దుబాయ్ నగరవ్యాప్తంగా పేలుళ్ల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే బూర్జ్ ఖలీఫాను మూసివేసినట్టు అధికారులు తెలిపారు. భారీ పేలుడు శబ్దాలను విన్నామని, తమ కిటికీలు, తలుపులు షేక్ అయ్యాయని ప్రత్యేక్ష సాక్షులు ఏఎఫ్‌పీ న్యూస్‌ ఏజెన్సీకి తెలియపారు.అబుదాబిలోని నివాస ప్రాంతంలో క్షిపణి శిథిలాల పడటంతో ఆసియా పౌరుడు ఒకరు మరణించాడని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘ఇటువంటి చర్యలు పౌరుల భద్రతకు ముప్పు.. ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసే పిరికిపంద చర్య’ అని యూఏపీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌తో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకుంది. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ దాడులకు పెంటగాన్ ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ అని పేరు పెట్టింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ మొహమ్మద్ పాక్‌పూర్ ఈ దాడుల్లో మరణించారని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం క్షిపణి దాడులకు ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఊహించన రీతిలో అమెరికా మిత్రదేశాల్లోని దాని స్థావరాలను టార్గెట్ చేసింది. దీంతో అన్ని గల్ఫ్ దేశాలూ తమ విమానాశ్రయాలను, గగనతలాలను మూసివేశాయి.