గ్రూప్ నుంచి ఏ జట్టు సెమీస్‌కు చేరుతుందని అందరూ టెన్షన్ పడ్డారు. ఇంగ్లండ్ వరుస విజయాలతో సెమీఫైనల్‌లో అడుగుపెట్టగా.. రెండో జట్టు న్యూజిలాండా, పాకిస్తానా అని అందరూ టెన్షన్‌లో మునిగిపోయారు. సాధించి కేవలం 6 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ, నెట్‌రన్‌రేట్ కారణంగా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. న్యూజిలాండ్, పాక్ పాయింట్లలో సమానంగా ఉన్నప్పటికీ .పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కి దిగిన పాకిస్తాన్ జట్టు విధ్వంసం సృష్టించింది. ఓపెనర్లు షాహిబ్‌జాదా ఫర్హాన్ - ఫఖర్ జమాన్ రికార్డు స్థాయిలో తొలి వికెట్‌కు 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. షాహిబ్‌జాదా ఫర్హాన్ సెంచరీ చేయడంతో పాక్ 250 వరకు పరుగులు చేస్తుందని అందరూ అనుకున్నారు. ఫఖర్ జమాన్ అవుటైన తర్వాత పాక్ వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు మ్యాచ్ ఓడిపోయినప్పటికీ దీటుగా ఆడి పాకిస్తాన్‌ను టీ20 వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించేలా చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకను 147 పరుగుల లోపు కట్టడి చేస్తేనే పాక్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించేది. కానీ పవన్ రత్నాయకే అటాకింగ్ బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ చేసి పాక్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆఖర్లో దాసున్ శనక సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. ఆల్‌మోస్ట్ శ్రీలంక గెలిచిందని అందరూ అనుకున్నారు. లంక 20 ఓవర్లలో 207/6 పరుగులు చేయడంతో 6 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది.భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక ఆరంభంలోనే పాతుమ్ నిస్సంక వికెట్ కోల్పోయింది. నిస్సంక అవుటైనా మరో ఓపెనర్ కమిల్ మిషారా మాత్రం అద్భుతంగా ఆడాడు. అయితే, అబ్రార్ అహ్మద్ వేసిన స్టన్నింగ్ బంతికి పవర్ ప్లే లోనే వికెట్ కోల్పోయాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 26 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. చరితా అసలంక 18 బంతుల్లో 1 ఫోర్లు, రెండు సిక్సర్లతో 25 పరుగులు చేసి అవుటయ్యాడు. అసలంక అవుటైన తర్వాత కమిందు మెండిస్, జనిత్ లియానగే వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. దాంతో శ్రీలంక 101 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. దాంతో అందర్నీలో టెన్షన్ మొదలైనా.. పవన్ రత్నాయకే కెప్టెన్ దాసున్ శనకతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. దాంతో పాకిస్తాన్ 147 పరుగులలోపే శ్రీలంకను కట్టడి చేయలేకపోయింది. పవన్ రత్నాయకే 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేసి అవుటయ్యాడు. దాసున్ శనక కెప్టెన్ ఇన్నింగ్స్‌‌తో కేవలం 31 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. దాంతో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 6 పరుగుల తేడాతోనే ఓటమిపాలయింది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిచినప్పటికీ నెట్ రన్‌రేట్ అధికంగా ఉన్న న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది.