Victims: కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. సీఎం చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు.. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి.. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిని సీఎం చంద్రబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. గాయపడినవారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యులైన నలుగురు అధికారులను సస్పెండ్‌ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఆర్డీఓ, డీఎస్పీ, డిస్టిక్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు గాయపడినవారికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పేలుడు పదార్థాల వద్ద సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం కనిపిస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు.. బాధ్యులైనవారి ఆస్తులు జప్తు చేసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా బాణసంచా తయారు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.అంతకుముందు సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఘటన గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహాయకచర్యల గురించి ఆరా తీశారు. ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మరోవైపు వేట్లపాలెం ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.