ఇరాన్‌ రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. అయితే, ఈ దాడుల్లో ఇరాన్ అగ్రనాయకత్వాన్ని తాము టార్గెట్‌ చేసినట్లు ఇజ్రాయెల్‌ తాజాగా ప్రకటించింది. అయితే, ఈ దాడులో మరణించినట్టు ఇజ్రాయేల్‌కు చెందిన కొన్ని మీడియా ఛానెళ్లు వార్తలు ప్రసారం చేయగా.. వీటిని ఇరాన్ ఖండించింది. తమ నేత సజీవంగానే ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ టెలివిజన్ ఛానెల్ 12 పేరు వెల్లడించని ఇజ్రాయెల్ వర్గాలను ఉటంకిస్తూ, ఖమేనీ మరణించారనడానికి సూచనలు ఉన్నాయని తెలిపింది.ఇతర కానీ దీనిని ధ్రువీకరించాల్సి ఉందని హెచ్చరించాయి. ఈ నివేదికల గురించి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి ఎన్బీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నాకు తెలిసినంత వరకు ఖమేనీ ఇంకా బతికే ఉన్నారని అన్నారు. పెంటగాన్ ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో చేపట్టిన దాడుల్లో ఇరాన్‌ రివల్యూషనరీ దళానికి చెందిన అనేక మంది సీనియర్ కమాండర్లు.. అధికార యంత్రాంగానికి చెందిన పలువురు అత్యున్నత స్థాయి అధికారులు చనిపోయినట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే,. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో టెహ్రాన్‌లోని 30 ప్రాంతాల్లో ఏకకాలంలో ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు చేశాయి. ఇరాన్‌ సుప్రీం నేత ఖమేనీ కార్యాలయ సమీపంలోనే మొదటి దాడి జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కానీ, ఆ సమయంలో ఖమేనీ అక్కడ లేరని, అప్పటికే సురక్షిత ప్రాంతానికి ఆయనను తరలించినట్లు తెలిపాయి. ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ కూడా సురక్షితంగా ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ వార్తలపై ఇరాన్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది. న్యూయార్క్ టైమ్స్ విడుదల చేసిన శాటిలైట్ ఫోటో.. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ ఆఫీసు ప్రాంగణం ధ్వంసమైనట్టు చూపుతోంది. ఇక, ఈ దాడిలో ఇరాన్ రక్షణ మంత్రి అమిర్ నసీర్‌జెదా, రివెల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ముహమూద్ పక్‌పౌర్ మరణించినట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.ఇరాన్‌పై దాడులను ఆపరేషన్ లయన్స్ రోర్‌ అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ధ్రువీకరించారు. ‘‘ప్రపంచ పటం నుంచి ఇజ్రాయెల్‌ను తుడిచిపెట్టడానికి ఉద్దేశించిన అణు బాంబులు, పదివేల క్షిపణులను అభివృద్ధి చేయడానికి టెహ్రాన్ అపారమైన వనరులను పెట్టుబడిగా పెట్టింది’ అని ఆరోపించారు. ఇరాన్ తన అణు, క్షిపణి సామర్థ్యాలను పునర్నిర్మించుకుంటోందని ఖమేనీ నేతృత్వంలోని హంతక పాలన నుంచి ఇరాన్ ప్రజలకు విముక్తి కల్పించడానికి తాము ఈ దాడులను చేపట్టినట్టు నెతన్యాహు పేర్కొన్నారు.మరోవైపు, ఇరాన్ కూడా తగ్గేది లేదని, ఇప్పటి వరకూ కేవలం పాతతరం ఆయుధాలనే వాడామని, కొత్త ఆయుధాలో దాడులు చేస్తే అమెరికా వణకుతుందని హెచ్చరించింది. తమ భూభాగంపై దాడిచేస్తే.. బదులు తీర్చుకునే హక్కు, సామర్థ్యం తమకు ఉన్నాయని ఉద్ఘాటించింది. ఇజ్రాయెల్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌తో సహా అనేక దేశాలలోని అమెరికా స్థావరాలు, ఆస్తులనే లక్ష్యంగా చేసింది. ‘‘మన పవిత్రమైన, ప్రియమైన మాతృభూమి, గర్వించదగిన ఇరాన్.. నాగరికతను నిర్మించిన దేశం.. మరోసారి అమెరికా, జియోనిస్ట్ పాలనతో నేరపూరిత సైనిక దురాక్రమణకు గురైంది’’ అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది, ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ దాడులు జరిగాయని ఎత్తి చూపింది.