శ్రీశైలం మల్లన్న ఆలయానికి మరో భారీ విరాళం అందింది. ఈ మేరకు ఆలయంలో మండపం నిర్మాణానికి టీడీపీ మహిళా ఎమ్మెల్యే భర్తతో కలిసి భారీ విరాళాన్ని అందజేశారు. శ్రీభ్రమర టౌన్‌ షిప్స్‌ అధినేత గళ్లా రామచంద్రరావు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి దంపతులు శ్రీశైలంలో మండపం శంకుస్థాపనకు చేశారు. ఈ సందర్భంగా మాధవి, రామచంద్రరావు దంపతులు.. మండపం నిర్మాణానికి సంబంధించి రూ.1.5 కోట్లు విరాళం చెక్కును దేవస్థానం ఛైర్మన్‌ రమేష్‌నాయుడుకు అందజేశారు. శ్రీశైంలో మండపం నిర్మాణం ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విరాళం అందజేశామన్నారు ఎమ్మెల్యే మాధవి. రాతి మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే దంపతులు ముందుకు రావడంపై ఛైర్మన్‌ రమేష్‌నాయుడు హర్షం వ్యక్తం చేశారు.లో ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శుక్రవారం తెల్లవారుజామున మల్లికార్జున స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు చేశారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక సంకల్పాలు పఠించి, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. ఆ తర్వాత గంగాధర మండపం దగ్గర స్వర్ణరథంపై స్వామి అమ్మవార్లను ఊరేగించారు. శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహఇంచారు. స్వామివారు బంగారు రథంపై కొలువుదీరి భక్తులకు దర్శనమించారు. నంది మండపం వరకు ఈ రథోత్సం కొనసాగింది. భక్తుల శివనామ స్మరణతో మల్లన్న క్షేత్రం మార్మోగింది. స్వర్ణరథం దగ్గర వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు చేసిన సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మరోవైపు శ్రీశైలంలో భ్రమరాంబదేవి అమ్మవారికి చైత్రమాస పౌర్ణమి తరువాత కుంభోత్సవం జరపడం సంప్రదాయంగా వస్తోంది. 'ఏప్రిల్‌ 7న అమ్మవారికి కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు, నిమ్మకాయలతో సాత్వికబలి కుంభోత్సవాన్ని జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఈ మేరకు అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో రాశులుగా పోసిన కొబ్బరికాయలకు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి సమర్పించారు' అని శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.