అక్కడ భీకర యుద్ధం.. బంగారమే రక్ష అంటున్న జనం.. 2 రోజుల్లోనే రూ. 11,500 జంప్..

Wait 5 sec.

: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. . ఇప్పటికే ఆ రెండు దేశాల దాడుల్లో ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ సహా పలువురు ముఖ్య నేతలు చనిపోయారు. ఈ క్రమంలోనే ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్ సహా పలు గల్ఫ్ దేశాలపైనా దాడులు తీవ్రతరం చేసింది. దీంతో . అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనికుల మృతికి ఇరాన్‍‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ యుద్ధం 4 వారాల పాటు జరుగుతుందని ట్రంప్ చెప్పారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే భారీగా పెరుగుతున్నాయి.సాధారణంగా ఇలాంటి రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతల సమయంలో.. ప్రజలు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి బంగారంపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆపద సమయంలో ఇదే ఆదుకుంటుందని నమ్ముతుంటారు. దీంతో ప్రస్తుత సంక్షోభ సమయంలో బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరిగి.. ధరలు కూడా అదే స్థాయిలో ఎగబాకుతున్నాయి. ఇప్పుడు రాత్రికి రాత్రే బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 5,320 డాలర్ల మార్కు దాటింది. కిందటి రోజు ఇది 5,200 డాలర్ల స్థాయిలో ఉండేది. కొద్ది రోజుల కిందట 4,700 డాలర్ల స్థాయికి చేరి అక్కడి నుంచి వరుసగా పెరుగుతూ వచ్చింది. సిల్వర్ రేటు చూస్తే ప్రస్తుతం 92.70 డాలర్ల స్థాయిలో ఉంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 91 స్థాయిలో ట్రేడవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లలోనూ అదే పరిస్థితి నెలకొంది. వరుసగా రెండో రోజు బంగారం ధర భారత్‌లో భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 4370 పెరిగి 10 గ్రాములకు రూ. 1,73,080 వద్ద ఉంది. ముందటి రోజు రూ. 7,140 పెరగడంతో 2 రోజుల్లోనే రూ. 11,500 కు పైగా పెరిగింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 4000 పెరిగి తులం రూ. 1,58,650 వద్ద ఉంది. ముందటి రోజు రూ. 6550 పెరిగింది. వెండి ధర మరో రూ. 5 వేలు పెరగ్గా కేజీకి ప్రస్తుతం రూ. 3.25 లక్షల వద్ద ఉంది. ముందటి రోజు రూ. 25 వేలు పెరగ్గా.. 2 రోజుల్లోనే రూ. 30 వేలు పెరిగింది.