వెంకీమామతో నందమూరి హీరో.. క్రేజీ మల్టీస్టారర్‌ ప్రకటించిన అనిల్‌ రావిపూడి..

Wait 5 sec.

‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో డైరెక్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈసారి దొరుకుతాడా లేదా? అనే డిస్కషన్స్ మధ్యలో వచ్చి, మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. వరుసగా తొమ్మిది విజయాలు అందుకున్న దర్శకుడిగా అరుదైన ఘనత వహించారు. దీంతో ఆయన 10సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్న తరుణంలో, అనిల్ రావిపూడి తన కొత్త సినిమాను ప్రకటించారు. విక్టరీ వెంకటేష్, హీరోలుగా తన నెక్స్ట్ మూవీని తెరకెక్కిస్తున్నట్లు అనిల్‌ రావిపూడి అధికారంగా ప్రకటించారు. ''మొదటి 'వందకోట్ల బొమ్మ' కొట్టిన హీరో గారితో.. 'మొదటిసారి బొమ్మ' తీసే అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్ గారితో కలిసి 2027 మొదటి పండగకి మీ, ముందుకు వస్తున్నాం'' అని అనిల్ ట్వీట్ చేశారు. దీనికి #VenkyAnil5 #NKRxAR అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించారు.