తెలంగాణలో మళ్లీ భారీగా ఐఏఎస్‌ అధికారుల ట్రాన్స్‌ఫర్లు చోటు చేసుకున్నాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) రామకృష్ణారావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా నియమితులు అయ్యారు. అదే సమయంలో ఆయనకు అదనపు బాధ్యతల కింద బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి పదవిని అప్పగించారు. మరోవైపు.. పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌కుమార్.. విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్‌కు అవకాశం కల్పించారు. ఫైనాన్స్‌ అండ్‌ ప్లానింగ్‌ విభాగం కార్యదర్శిగా గౌరవ్‌ ఉప్పల్‌.. దేవాదాయశాఖ కమిషనర్‌గా ఎం.హనుమంతరావు.. ప్రజావాణి రాష్ట్ర నోడల్‌ అధికారిగా డి.దివ్యను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పలు జిల్లా కలెక్టర్లకు ఈసారి స్థాన చలనం కల్పించారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి - రాహుల్‌ బొజ్జా పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ - సంజయ్ కుమార్ఎస్పీడీసీఎల్ సీఎండీ - జితేశ్ వి. పాటిల్కొత్త డిస్కం సీఎండీ - ముషారఫ్ ఫారూకీఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ - ఈ. శ్రీధర్ఐటీ అండ్ సీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ - ఎన్. శ్రీధర్ఫైనాన్స్‌ అండ్‌ ప్లానింగ్‌ విభాగం సెక్రటరీ - గౌరవ్ ఉప్పల్‌డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ - ఎం. దాన కిషోర్ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీ - సిక్తా పట్నాయక్ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌ - బి.ఎం. సంతోష్లేబర్ స్పెషల్ కమిషనర్‌ - పమేలా సత్పతికో ఆపరేటివ్ కమిషనర్‌ - పి.ఎస్. రాహుల్ రాజ్దేవాదాయశాఖ కమిషనర్‌ - ఎం.హనుమంతరావుప్రజావాణి రాష్ట్ర నోడల్‌ అధికారి - డి.దివ్యమహబూబ్‌నగర్ కలెక్టర్‌ - బి. విజయేంద్రకరీంనగర్ కలెక్టర్‌ - చిత్ర మిశ్రాహన్మకొండ కలెక్టర్‌ - చాహత్ బాజ్‌పాయ్భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ - అంకిత్యాదాద్రి కలెక్టర్‌ - అనురాగ్ జయంతిజనగాం కలెక్టర్‌ - సందీప్ కుమార్ ఝాజోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ - రిజ్వాన్ బాషా షేక్మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌ - స్నేహ శబర్ష్రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ - గరిమా అగర్వాల్వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ - దీపక్ తివారీవికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌ - ఉమా శంకర్ ప్రసాద్మెదక్ జిల్లా కలెక్టర్‌ - ప్రతిమా సింగ్మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్‌ - ఫైజాన్ అహ్మద్‌