లో భారత్ - పాక్ మ్యాచ్ తర్వాత అంత హై ఓల్టేజ్ మ్యాచ్ ఏదంటే కచ్చితంగా అనే చెప్పొచ్చు. విధ్వంసకర బ్యాటర్లతో నిండిన ఈ రెండు జట్ల మధ్య పోరు కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్లు, అభిమానులు కూడా ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారా? అంటూ ఉత్కంఠగా చూస్తున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సూపర్ 8లో భాగంగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో వెస్టిండీస్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు రానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధిస్తే, టీమిండియాకు సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వెస్టిండీస్ గెలిస్తే భారత్ దాదాపు ఇంటిదారి పట్టినట్టే.టీ20 చరిత్రలో మధ్య మొత్తం 29 మ్యాచ్‌లు జరిగితే.. వెస్టిండీస్ అత్యధికంగా 15, సౌతాఫ్రికా 14 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. అంటే ఇరు జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టే ఉంది. అయితే, ‌లో మాత్రం సౌతాఫ్రికాదే పైచేయిగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరిగితే సౌతాఫ్రికా 4 గెలవగా, వెస్టిండీస్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది. అది కూడా 2016లో భారత్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లోనే. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజ్‌లో ఇరు జట్లు కూడా తమ సత్తా చాటాయి. సౌతాఫ్రికా గ్రూప్ స్టేజ్‌లో నాలుగు మ్యాచ్‌లు గెలవగా, వెస్టిండీస్ కూడా అన్ని మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. సూపర్ 8లో సౌతాఫ్రికా భారత్‌పై విజయం సాధిస్తే, జింబాబ్వేపై వెస్టిండీస్ తిరుగులేని విజయం సాధించింది. సౌతాఫ్రికా జట్టుఎయిడెన్ మార్కరమ్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, ర్యాన్ రికెల్టన్, డివాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సన్, కార్బిన్ బాష్, కగిసో రబడా, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి. వెస్టిండీస్ జట్టుబ్రాండన్ కింగ్, షై హోప్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రూధర్‌ఫోర్డ్, రొమారియో షెఫర్డ్, జేసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, రోస్టన్ ఛేజ్, గుడకేశ్ మోటీ, షమార్ జోసఫ్.